*తడ* , *బివి* *పాలెం* *ఉమ్మడి* *తనిఖీ* *కేంద్రం* *వద్ద* *గంజాయి* *పట్టివేత*
*ఇద్దరు* *నిందితులను* *అదుపులోకి*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ మండలం, బీవీ పాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద శుక్రవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు చేపట్టిన వాహన తనిఖీలలో 12 కేజీల గంజాయిని పట్టుకున్న ఘటన చోటుచేసుకుంది.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆర్ యు వి ఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నెల్లూరు వారి ఆదేశాల ప్రకారం వివి పాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద వాహన తనిఖీలు చేపట్టగా నెల్లూరు నుండి చెన్నైకి వెళుతున్న తమిళనాడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన శంకత్ అలీ, శన్వస్ ఇద్దరు వ్యక్తుల నుండి 12 కేజీల గంజాయి పట్టుకోవడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
పట్టుబడిన వ్యక్తులు విచారించగా ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం ప్రాంతం నుండి కొనుగోలు చేసిన 12 కేజీల గంజాయిని కేరళ రాష్ట్రంలో కేజీ 20 వేల చొప్పున విక్రయించుకునే వారిని వారి విచారణలో నిందితులు తెలిపినట్లు
వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సి ఐ RUVS. ప్రసాద్ తెలిపారు.
Post a Comment