పొలంబడి కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు.
నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో జిల్లా వనరుల శాఖ ఏ డి ఏ ఎం శ్రీనివాసులు, డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ ఓబయ్య జంగాలపల్లి, కోటపోలూరు గ్రామాల్లో సందర్శించి రైతులకు తగు సూచనలు తెలియజేసారు.పొలాల్లో ముఖ్యంగా మిత్ర పురుగులను, సాలేజా, తూనీగా, గొల్లభామ సంరక్షణకు శత్రువు నాశనానికి పురుగులను వాడి వాటిని నివారించవచ్చునని అన్నారు. పొలమును ప్రతిరోజు పరిశీలిస్తూ అవసరమైన మేర పురుగుమందులు వినియోగించాలని రైతులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సులూరుపేట వ్యవసాయ అధికారి కవిత, AO లు హిమబిందు, నాగరాజు మరియు రైతులు పాల్గొన్నారు.
Post a Comment