ఘనంగా 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పేద, బడుగు, బలహీన, రైతు, కార్మిక, కర్షక వర్గాల ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉన్నదని సిపిఐ కావలి నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యం తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించి, జెండా ఆవిష్కరించారు.దేశ స్వాతంత్య్ర అమృతోత్సవం జరుగుతున్న వేళ, స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు, రాజ్యాంగ లక్ష్యాలు తిరుగమిస్తున్న వేళ, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలు కాపాడుతామని, లౌకిక వాద, సోషలిస్టు తరహా సమాజం, గణతంత్ర వ్యవస్థ నిర్మాణ లక్ష్యాలు కాపాడుతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డేగా సత్యం మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిస్టు పాలన ఉన్న ప్రతి దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. 97 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేళలా పేదలకు అండగా నిలబడిందన్నారు. ప్రజా సమస్యల కొరకు నిరంతరం పోరాటాలు చేస్తూ, బానిసత్వానికి వ్యతిరేఖంగా బ్రిటిష్ ప్రభుత్వాలను ఎదురించి పేదలకు అండగా నిలబడిందన్నారు. దున్నే వాడికి భూమి కావాలని పోరాటాలు చేశామని తెలిపారు. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో ఎన్నో పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ చేసిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా పోరాటాలు చేస్తూ, ప్రజల పక్షాన నిలబడటం జరిగిందన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పసుపులేటి మహేష్, చేవూరు కొండయ్య, మల్లి అంకయ్య, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment