కార్పొరేషన్ ఎన్నికల్లో మరీ ఇంతలా దిగజారిపోవాలా


 

ఆ అధికారులకన్నా అటెండర్లే మేలు..

కార్పొరేషన్ ఎన్నికల్లో మరీ ఇంతలా దిగజారిపోవాలా

ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ము వైసీపీకి లేదు

ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్వోల వైఖరికి నిరసనగా నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, బీసీ జనార్దన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనూరాధ తదితరులు 

అధికారులు మరీ ఇంతగా దిగజారిపోవాలా..మీ కంటే అటెండర్లే మేలుగా ఉన్నారు  ఇలాంటి ఘోరమైన వ్యవస్థను ఎప్పుడూ చూడలేదు నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసి గంటలు గడుస్తున్నా అభ్యర్థుల జాబితాను వెల్లడించరా. కలెక్టర్, కమిషనర్ తో మాట్లాడితే కాసేపు కాసేపు అని సాగదీసుకుంటూ వస్తున్నారు  నిమిషాల వ్యవధిలో సిద్ధమయ్యే జాబితా కోసం ఆర్వోలుగా ఉన్న 14 మంది జిల్లా అధికారులు గంటలకు గంటలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు  టీడీపీ అభ్యర్థులకు ఆర్వోలు ఫోన్ చేసి సంతకాలు చేయడానికి రమ్మని పిలుస్తారా..ఉపసంహరణల సమయంలో మా అభ్యర్థుల సంతకాలతో మీకేం పని మా అభ్యర్థులను అలా పిలవడానికి ఆ అధికారులకు బుద్ధుందా  ప్రజల డబ్బును జీతాలుగా తీసుకుంటూ బరితెగించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు కార్పొరేషన్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ము వైసీపీకి లేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి నెల్లూరు నగరాన్ని నందవనంగా తీర్చిదిద్దాం వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో నెల్లూరును గాలికొదిలేశారు.. ఈ రోజు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక దౌర్జన్యాలు, కిడ్నాప్ లు చేయడంతో పాటు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి అభ్యర్థులను పోటీ నుంచి తప్పిస్తారా.. ఇలా జరిగే ఎన్నికలను ఎన్నికలు అంటారా..దీనికి మళ్లీ ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనా  జరుగుగుతున్న అరాచకాలను గమనిస్తున్న నెల్లూరు నగర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget