కావలి R. S. R ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులైన N. C. C. క్యాడెట్స్ కు సర్టిఫికెట్లు ప్రధానం
ఎన్‌సీసీ శిక్షణతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ –కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
ఎన్‌సీసీ శిక్షణ ద్వారా విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ సొంతం చేసుకోవచ్చని కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. కావలి వద్ద ఉన్న ఆర్‌ఎస్సార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మొదటి బ్యాచ్ ఎన్‌సీసీ క్యాడెట్స్‌కు సర్టిఫికేట్స్ ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రామిరెడ్డి ఆదిలక్ష్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్‌సీసీ మొదటి బ్యాచ్ క్యాడెట్స్‌కు ‘ఏ’ సర్టిఫికేట్స్ అందచేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్‌సీసీ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయా భావం, సేవాభావంతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందుతాయన్నారు. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులతో పాటు కోవిడ్ వంటి విపత్కర సమయాల్లో కూడా ఎన్‌సీసీ విద్యార్థులు అందించిన సేవలకు ఈసందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఎన్‌సీసీ శిక్షణలో నేర్పించే విషయాలు విద్యార్థుల భావిజీవితాన్ని క్రమశిక్షణతో తీర్చిదిద్దుతాయని తెలిపారు. అదే విధంగా ఎన్‌సీసీ సర్టిఫికేట్ పొందిన విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్లు ఉండటంతో ఉద్యోగవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయని వివరించారు. అనంతరం జిల్లా చెస్ అసొసియేషన్ పోటీలు, నేషనల్ ఒలింపిక్స్‌లో షార్ట్‌పుట్, జావెలిన్‌త్రోలో ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థులకు మెడల్స్ అందచేశారు. కార్యక్రమంలో కావలి ఆర్డీవో శీనానాయక్, డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, సుబేదార్ మేజర్ పూల్‌చంద్, హల్వేదార్ సతనం సింగ్, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment