పదవీ విరమణ చేస్తున్న పోలీసు జాగిలాలను ఘనంగా సన్మానించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS.

 పదవీ విరమణ చేస్తున్న పోలీసు జాగిలాలను ఘనంగా సన్మానించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు 





ఆప్యాయంగా జాగిలాలను చేతితో నుమురుతూ జాగిలాల సేవలు కొనియాడిన జిల్లా యస్.పి. గారు.. పదవీ విరమణ పొందుతున్న అధికారులతో సమానంగా పూలమాలలు, శాలువ, పూలతో ముంచెత్తుతూ ఘనంగా సన్మానం.... జిల్లా పోలీసు శాఖలో జాగిలముల సేవలు చిరస్మరణీయం... జంతువులలో విశ్వాసంగా, భాద్యతగా, చురుకుగా ఉండే వాటిలో జాగిలము ఒకటి.. సింధు జాగిలము 27.07.2011 న జననం,2012 లో IITA మైనాబాద్, హైదరాబాదు నందు ట్రైనింగ్.... DPO నందు నవంబర్ 2012 నుండి విధులు నిర్వహణ.. సింధు అనే జాగిలం లెబ్రాడర్ రిట్రీవర్(ఆడ) అనే జాతికి చెంది, ఎక్స్ ప్లోజివ్ ను కనుగొనుటలో ప్రత్యేక నైపుణ్యం కలదు.. పోలీసు శాఖకు 10 సంవత్సరాల 5 నెలలు సేవలు అందించింది.. 2013 లో రీఫ్రెష్మెంట్ కోర్సులో రాష్టంలో ద్వితీయ స్థానం పొందింది.. గత 3 నెలల క్రితం IED లను తడ వద్ద కనుకోనబడినది.. అంతేకాకుండా VVIP, అసెంబ్లీ, TTD బ్రహ్మోత్సవాలు, కృష్ణ, గోదావరి పుష్కరాలలో ఎనలేని సేవలను అందించింది.. లక్కీ అనే జాగిలము 10.03.2011 న జననం, 2012 లో IITA మైనాబాద్, హైదరాబాదు నందు ట్రైనింగ్.... DPO నందు నవంబర్ 2012 నుండి విధులు నిర్వహణ.. లక్కీ అనే జాగిలం జర్మన్ షెఫర్డ్(ఆడ) అనే జాతికి చెంది,  ట్రాకింగ్ లో ప్రత్యేక నైపుణ్యం కలదు.. పోలీసు శాఖకు 10 సంవత్సరాల 8 నెలలు సేవలు అందించింది.. 2013 లో రీఫ్రెష్మెంట్ కోర్సులో ట్రాకింగ్ లో రాష్టంలో మొదటి స్థానం పొందింది.. హత్యలు, దొంగతనాలు, డెకాయిట్, కిడ్నాప్ వంటి కేసులను చేదన.. సుమారు 18 హత్యలు, దొంగతనం కేసులను చేధించిన లక్కీ... వయసు రీత్యా నిపుణుల సూచనల మేరకు పదవీ విరమణ చేసిన సింధు, లక్కీ అనే రెండు జాగిలాలు... నేడు పదవీ విరమణ సన్మాన సభ ఏర్పాటు చేసి, ఘనంగా సత్కరించిన యస్.పి. గారు.. పోలీసు శాఖకు మరువలేని సేవలందించిన జాగిలాలు పలువురిని ఆకర్షిస్తూ, నిబద్ధతతో విధులు నిర్వహణ  ఈ జాగిలముల రక్షణ, ఆహార పోషణ, నియమాలు బాగుగా చూసుకున్న సిబ్బందిని అభినందించిన జిల్లా యస్.పి. గారు.. 

SPS నెల్లూరు జిల్లా  పోలీస్ డిపార్ట్మెంట్ లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నందు సింధు మరియు లక్కీ అనే జాగిలములు 10 సంవత్సరాలు సేవలు చేసి, నిపుణుల సూచనల మేరకు, ఈ రోజు అనగా తేది.01.10.2021 న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా యస్.పి శ్రీ విజయ రావు,IPS., గారు ఘనంగా సన్మానించారు.. 

ఈ సందర్భంగా జిల్లా యస్.పి. గారు మాట్లాడుతూ ఎంతో విశ్వాసంగా, భాద్యతాయుతంగా వ్యవహరిస్తూ, చురుకుగా ఉండే జంతువులలో జాగిలము ఒకటి... జాగిలముల పదవీ విరమణ పోలీసు అధికారులతో సమానంగా సన్మానించి, వాటి సేవలను కొనియాడడం జరిగింది.  

సింధు అనే జాగిలము లాబ్రాడర్ రీట్రైవర్ జాతికి చెందినది. 27.07.2011 న జన్మించింది. సింధు ‘ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ’, ఎ.పి. హైదరాబాద్ నందు పేలుడు పదార్ధాలు కనిపెట్టుటలో శిక్షణ పొందింది. శిక్షణ సమయంలో అసాధారణమైన ప్రతిభను కనపరిచి అద్భుతమైన గ్రేడ్ తో విజయవంతంగా శిక్షణను పూర్తిచేసింది. శిక్షణ పూర్తయిన తరువాత 2012 లో నెల్లూరు జిల్లాలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నందు నియమించబడిన విధి నిర్వహణలో సింధు ఎన్నో విధులు నిర్వహించినదని తెలిపారు. సింధు 10 సంవత్సరాల 5 నెలలు జిల్లాకు సేవలు అందించింది. సింధు హ్యండ్లర్ ARPC-2414 శ్రీ SK మస్తాన్ వలి. 2013 లో రీఫ్రెష్మెంట్ కోర్సులో రాష్టంలో ద్వితీయ స్థానం పొందింది. 3 నెలల క్రితం IED లను తడ వద్ద కనుకోనబడినది.. అంతేకాకుండా VVIP, అసెంబ్లీ, TTD బ్రహ్మోత్సవాలు, జనరల్ ఎలక్షన్ లో కూడా విధులు మరియు ఇతర ముఖ్యమైన బందోబస్తు విధులను విజయవంతంగా నిర్వహించి, కృష్ణ, గోదావరి పుష్కరాలలో ఎనలేని సేవలను అందించింది. 

లక్కీ అనే జాగిలము జర్మన్ షెఫర్డ్(ఆడ) అనే జాతికి చెందినది. 10.03.2011 న జన్మించింది. లక్కీ ‘ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ’, ఎ.పి. హైదరాబాద్ నందు ట్రాకింగ్ లో శిక్షణ పొందింది. శిక్షణ పూర్తయిన తరువాత 2012 లో నెల్లూరు జిల్లాలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నందు నియమించబడిన విధి నిర్వహణలో లక్కీ ఎన్నో విధులు నిర్వహించినదని తెలిపారు. లక్కీ 10 సంవత్సరాల 8 నెలలు జిల్లాకు సేవలు అందించింది. లక్కీ హ్యండ్లర్ ARPC-2413 శ్రీ PV సుకుమార్. 2013 లో రీఫ్రెష్మెంట్ కోర్సులో రాష్టంలో మొదటి స్థానం పొందింది. లక్కీ హత్యలు, దొంగతనాలు, డెకాయిట్, కిడ్నాప్ వంటి కేసులను చేదిస్తుంది. ఇప్పటి వరకు 18 హత్యలు, దొంగతనం కేసులను చేధించింది. 

ఈ కార్యక్రమంలో యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి వెంకటరత్నం, డి.యస్.పి.(DTC) శ్రీ గోపాలకృష్ణ, యస్.పి.(ఎ.ఆర్.) శ్రీ యం.గాంధీ, SB CI-1 శ్రీ అక్కేశ్వరరావు, CI-2 శ్రీ రామకృష్ణ, RI అడ్మిన్ శ్రీ రమణారెడ్డి గార్లు, డాగ్ స్క్వాడ్ ఇంచార్జ్ ARSI నాగూర్ బాషా, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, BD టీం సిబ్బంది, ఇతర అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget