వాకాడు....హైదరాబాదులోని HACA భవన్ నందు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో "రెండు తెలుగు రాష్ట్రాల విత్తనాభివృద్ధి సంస్థలకు సంబంధించిన సమావేశము" లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య అతిథులుగా పేర్నాటి దంపతులు పాల్గొనడం జరిగింది.
కేంద్ర విత్తనాభివృద్ధి సంస్థ జాయింట్ సెక్రటరీ Dr.N విజయ లక్ష్మి గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి రైతులు కేంద్రం నుంచి వస్తున్న సబ్సిడీ గురించి చర్చించడం జరిగింది. విత్తన ఉత్పత్తికి సంబంచి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మనము పాలసీని ప్రవేశపెట్టపోతున్నాము అనే అంశంపై చర్చించడం జరిగింది. మన రాష్ట్రంలో 33 విత్తన నిల్వ మరియు శుద్ది గోదాముల గురించి వివరించడం జరిగింది. National Seed Export గురించి జాయింట్ సెక్రెటరీ గారు వివరించడం జరిగింది.
మన రాష్ట్రంలో, మన గౌరవ ముఖ్యమంత్రి గారు RBKల ద్వారా మనము ఏవిధంగా రైతులకు విత్తనాలు అందచేయబోతున్న విషయం కూడా చర్చించడం జరిగింది. Export & Import కు సంబంధించి రెండు రాష్ట్రాలు పడుతున్న ఇబ్బందులు గురించి జాయింట్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కొత్త రకం విత్తనాలకు సంబంధించి పూర్తిస్థాయిలో సబ్సిడీ ఇవ్వవలసిందిగా జాయింట్ సెక్రెటరీ గారిని కోరడం జరిగింది. విత్తనాభివృద్ధి కి సంబంధించి "Skilled Labour" అవసరం ఉంది కాబట్టి చర్చించడం జరిగింది. AP State Skill Development Corporation వారి సహాయముతో మన విత్తనాభివృద్ధికి సంబంధించిన వారిని ఎంపిక చేసుకోమని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కె. కోటేశ్వరరావు గారు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు గారు, తెలంగాణ అగ్రికల్చర్ కమిషనర్ కె.హనుమంతు గారు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.శేఖర్ బాబు గారు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Post a Comment