వాకాడు:- హైదరాబాదు రాజేంద్రనగర్ లోని "Seeds DNA Testing Lab ,Seed Testing Lab & Millets processing units లను సందర్శించిన పేర్నాటి దంపతులు.
పరిశోధన కేంద్రంలో విత్తనాలు ఏవిధంగా పరీక్షిస్తున్నారు, అదేవిధంగా విత్తనాల నాణ్యతను పరిశీలించి, అదేవిధంగా వాటికి సంబంధించిన మూలం ఎలా వచ్చింది అని పరీక్షించి, విత్తనాలను సర్టిఫై చేసిన తర్వాత, మార్కెట్లోకి విడుదల చేసే వివిధ దశల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం జరిగింది.
నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ జాయింట్ సెక్రెటరీ N. విజయ లక్ష్మి గారు మాట్లాడుతూ రెండు రాష్ట్రాలకు సంబంధించి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రెండు రాష్ట్రాలకు సంబంధించిన నిధులు కానీ వ్యవసాయ ఉత్పత్తులకు, వ్యవసాయ పనిముట్లకు పూర్తిస్థాయిలో నా వంతు సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు.
పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ తరపున ఆహ్వానం పంపుతామని మీరు ఒకసారి మా రాష్ట్రానికి కూడా సందర్శించాలని కోరడం జరిగిందని, దానికి ఆమె సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు
అదేవిధంగా చిరుధాన్యాలకు (మిల్లెట్స్) సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లను పేర్నాటి దంపతులు సందర్శించడం జరిగింది. మన రాష్ట్రంలో చిరుధాన్యాలను పండించడం వాటిని ప్రాసెసింగ్ చేసే మిషనరీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థాపించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన అని, అందుకు అనుగుణంగా ఈరోజు మిలెట్స్ ప్రాసెసింగ్ యూనిట్ ను, మిల్లెట్స్ అవుట్ లెట్ లను సందర్శించి వాటికి వాడే మిషనరీ గురించి తెలుసుకోవడం జరిగింది.
రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్లను వీలైనన్ని ఎక్కువగా స్థాపించేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి వాటి స్థాపనకు మా వంతు కృషి చేస్తామని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ జాయింట్ సెక్రెటరీ N.విజయలక్ష్మి గారు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ G.శేఖర్ బాబు గారు, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు గారు పాల్గొన్నారు.
Post a Comment