ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు నేడు కే.వి.ఆర్. పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పధకాలను ప్రజలకు అందిస్తూ, ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా భారత దేశం సైతం గుర్తించిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలపట్ల పట్టాభి చేత చంద్ర బాబు నాయుడు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పించాలి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఆరోగ్యకరమైన విమర్శలు చేయాలేతప్ప రాజకీయాలకోసం ప్రజల్లో ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఇలాంటి రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి తగదు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. మీరు చేసే జిమ్ముక్కులు ప్రజలు గమనిస్తున్నారనే సంగతి చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలని తెలిపిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఇప్పటికే 45 సంవత్సరాల రాజకీయ చరిత్రకలిగిన వాడినని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు 23 సీట్లకే పరిమితం చేశారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. తమ నాయకుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి స్వీకరించినప్పటినుంచి గడిచిన రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ పాలనలో అనేక రకాల ఎన్నికలు జరిగినప్పటికీ పూర్తిస్థాయి మెజారిటీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారంటే ప్రజల మద్దతు తమకు ఉన్నదనే సంగతి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, డివిజన్ ఇంచార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment