గూడూరు డివిజన్ లో టీడీపీ తమ్ముళ్లును కట్టడి చేసిన పోలీసులు






 
గూడూరులో టీడీపీ బంద్‌.. 

పోలీసులు- కార్యకర్తల మధ్య తోపులాటలు.. 

ఉద్రిక్తంగా మారిన తెలుగు తమ్ముళ్ల నిరసనలు 

తెలుగు తమ్ముళ్ల అరెస్ట్- పోలీసు స్టేషన్ కు తరలింపు 

ముందస్తు అరెస్టులు..దారుణం: పాశం 

వైసీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదు: పాశం 

 రౌడీ సియం జగన్ అంటూ...పాశం నినాదాలు 

డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆదేశాలు మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు 

 గూడూరు డివిజన్ లో  టీడీపీ తమ్ముళ్లును కట్టడి చేసిన పోలీసులు 

 అధికారం ఉంటే  రౌడీయిజం చేయడం  హేయమైన చర్యలు: పాశం ధ్వజం 

 ఏపీలో రాజకీయాలుభగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. ఆయన ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. వైసీపీ నేతల దాడికి నిరసనగా టీడీపీ బుధవారం బంద్‌కు పిలుపునిచ్చింది. రెండు పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. వైసీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. 

 ముందస్తు అరెస్టులు.. 

 దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. అందులో భాగంగా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు, అదేవిధంగా పలువురు టీడీపీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు,దింతో పాశం సునిల్ కుమార్ కి ఆగ్రహంకట్టలు తెంచుకొవడంతో ఆయన టిడిపి నాయకులు, కార్యకర్తలు తన ఇంటి వద్దకు రావాలి అని పిలుపునిచ్చారు, దింతో భారీగా తెలుగు తముళ్లు తరలి వచ్చి రోడ్లపై నిరసనకు దిగుతున్న వారిని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో పట్టణ సీఐ నాగేశ్వరమ్మ,ఎస్సై లు, పోలీసులు సిబ్బంది అదుపులోకి తీసుకుని స్టేషన్‌లకు తరలించారు, దీంతో టీడీపీ కార్యకర్తల నిరసనలతోహోరెత్తుతోంది. 

 టీడీపీ నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు, గూడూరులో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే విధ్వంసం జరుగుతుందనిఆరోపించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేపడుతున్నారని ధ్వజమెత్తారు.ఈవ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయనకోరారు.ప్రభుత్వందారుణానికిపాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు 

 వైసీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదు: పాశం 

 టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలను ఇంతవరకు అరెస్టు చేయలేదని, న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తమను పోలీసులు బలవంతంగా చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

 అరెస్ట్ అయిన తెలుగు తమ్ముళ్లు వీరే.. 

 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై  వైసీపీ వాళ్ళు దాడికి నిరసనగా బుధవారం తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు బయలు దేరుతున్న గూడూరుమాజీశాసనసభ్యుల పాశిం సునీల్ కుమార్ ని మరియు తెలుగు దేశం పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకొని  అక్రమంగా అరెస్టు చేసి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు,సునీల్ కుమార్ తో పాటు గూడూరు పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తాతపూడి ఇశ్రాయేల్ కుమార్, పట్టణ కార్యదర్శి నిమ్మకాయలు నర్సింహులు, మాజీ కౌన్సిలర్స్ వాటంబేటి శివకుమార్ పుచ్చలపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా బిసి సెల్ కార్యదర్శి పిల్లెళ్ళ శ్రీనివాసులు, తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి బత్తిన ప్రణీత్ యాదవ్, నియోజకవర్గ, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు, పట్టణ బిసి సెల్ అధ్యక్షులు రావుల శివ ప్రసాద్ గౌడ్, నాయకులు చంద్రమౌళి, అల్లీహుస్సేన్, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు అనంతరం పూచీకత్తు పై విడుదల చేశారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget