రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు
రాష్ట్రంలో శాంతిభద్రత లు పూర్తిగా లోపించాయి , ప్రతిపక్ష నేతల ఇళ్ళ మీద , దాడులు చేయడం చూశాం , ఇప్పుడు ఏకంగా రాష్ట్ర కార్యాలయాల మీద పడి దాడి చేయడం అత్యంత హేయం.
ఇటీవల డిసెంబర్ నందు తాడిపత్రి లోని జెసి ఇంటిమీద ,తర్వాత పట్టాభి గారి ఇంటి మీద దాడి జరుగగా అది కాకుండా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి ఇంటి మీదకు కూడా ఇటీవల ఇదే తరహా దాడికి యత్నించడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంటో స్పష్టం అవుతోంది. ఇంత గుంపులు గుమిగూడి దాడులకు బయలుదేరుతున్నా పోలీస్ వారికి ముందస్తు సమాచారం లేకపోవడం చూస్తుంటే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రశ్నిస్తే దాడులకు తెగబడటం , అక్రమ కేసులు బనాయించడం ప్రతిపక్ష నేతల గొంతును బలవంతంగా నొక్కే ప్రయత్నం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ వరుస ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది , రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇటువంటి దాడులకు తెగబడుతున్నారు అనిపిస్తోంది. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం , రాష్ట్ర గవర్నర్ గారు రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలను పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేయకపోతే రాష్ట్రం రావణకాష్టం కాకతప్పదు.
నిరసనలో పాల్గొన్న వారు ఓజిలి మండలం టిడిపి
సీనియర్ నాయకులు డి సి రెడ్డి గారు , కమలాకర్ బాబు ,దువ్వూరు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ సర్పంచి సుబ్రహ్మణ్యం రాజుగారు ,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మైలారి సీనయ్య గారు ,వెంకట్ రెడ్డి పాలెం గోపాలయ్య ,కోటేశ్వరరావు గారు బీసీ సెల్ కార్యదర్శి వెంకటేశ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
Post a Comment