అసోంని తలపించేలా ఏపీలో పరిస్థితులు
అక్కడ బోడో తీవ్రవాదులు నిర్బంధ వసూళ్లకు పాల్పడిన తరహాలో కృష్ణపట్నం పోర్టు వద్ద కాకాణి టోల్ గేట్లో లారీల నుంచి దోపిడీ లారీ డ్రైవర్లను నిర్బంధించి మరీ నిత్యం లక్షలాదిగా అక్రమ వసూళ్లు జిల్లాలో పరిపాలన వ్యవస్థ ఉందో..లేదో అర్థం కాని పరిస్థితి నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజల నోళ్ళు కొట్టడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన ఎన్ఆర్జీఎస్ నిధుల విషయంలో కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. కోర్టులు ఆదేశాలు జారీ చేస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగడం లేదు. రాష్ట్ర ప్రజలకు చివరకు న్యాయం కోసం కోర్టులే దిక్కయ్యాయి.
టీడీపీ హయాంలో అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తే వాటిని స్మశానాలుగా మార్చారు.. అందుకు ఉదాహరణ అల్లీపురలో నిర్మించిన వేలాది ఇళ్లే..
ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట కూడా లబ్ధిదారులకు అందించడంలో వైసిపి విఫలం చెందింది. సొంత ఇంటిలోకి అడుగు పెడదామనుకున్నా పేదలకు నిరాశే మిగిల్చింది. లబ్ధిదారులను గృహప్రవేశాలు చేయకుండా ఆపారు..ఇప్పటికైనా కళ్లు తెరిచి మానవత్వం ప్రదర్శించండి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి నిష్పక్షపాతంగా పథకాలు అందించాం. ఇప్పుడు వలంటీర్ల కాళ్లు పట్టుకుంటేనే పథకాలు అంటున్నారు.. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు. జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు 13 సంవత్సరాలుగా రన్ అవుతుంటే మొదటిసారి టోల్ పేరుతో వాహనాలు ఆపారు. కాకాణి టోల్ అంటూ టోల్ గేట్ ఏర్పాటుచేసి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. టోల్ ఏర్పాటు చేసేందుకు ఎవరిచ్చారు మీకు అధికారం... ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా...ట్యాక్స్ కడుతున్నారా టోల్ పేరుతో అక్రమంగా లక్షలకు లక్షలు వసూలు చేస్తుంటే జిల్లాలో మంత్రులు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు..
అసలు జిల్లాలో మంత్రులు, కలెక్టర్, ఎస్పీ ఏమైపోయారు... జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఇంత జరుగుతున్నా మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులకు నోరు తెరిచే దైర్యం లేదు. తక్షణం కాకాణి టోల్ ను అధికారులు విజిట్ చేసి చర్యలు చేపట్టాలి. అస్సాం రాష్ట్రంలోని పరిస్థితులను ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తున్నాం. జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ పరిష్కార సెల్ ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి మారితే చట్టాలు మారవు. అధికార పార్టీ నాయకుల మాటలు విని అక్రమాలు చేసిన అధికారులు కోర్టుల ముందు హాజరవుతున్నారు. అందుకు ఉదాహరణ ముత్తుకూరు మండలం డమ్మాయపాళెం ఘటనే..
Post a Comment