నియోజకవర్గ అభివృద్ధి పై సీఎంకు ఎమ్మెల్యే వినతి
స్ధానిక ఎన్నికల విజయం పై ఎమ్మెల్యే కు సీఎం అభినందన
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే ఆదిమూలం, జడ్పిటిసి సుమన్ కుమార్
సత్యవేడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నారాయణవనం జడ్పిటిసి సభ్యులు కోనేటి సుమన్ కుమార్ లు ముఖ్యమంత్రి జగనన్నను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సత్యవేడు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, నాడు - నేడు పనులు, జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు, సచివాలయాలు, వెల్ నెస్, రైతు భరోసా, పాల కేంద్రాలు, ఇరిగేషన్ పనుల పురోగతిని సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గంలో ఏడు జెడ్పిటిసి స్థానాలు, 80 కి 76 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకోవడం పై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ, ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం సంతోషమన్నారు. ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందు ఉండాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చడంలో తప్పక సహకరిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలో పార్టీని ప్రభుత్వాన్ని విజయ పథంలో నడిపించాలని ఎమ్మెల్యే ఆదిమూలంకు సీఎం సూచించారు.
సుమన్ నాన్న కు అండగా..
పార్టీ కార్యక్రమాల్లో నాన్న (ఆదిమూలం) కు అండగా ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నారాయణవనం జడ్పిటిసి సభ్యులు సుమన్ కుమార్ కు సూచించారు. పార్టీ పటిష్టతకు అందరిని కలుపుకోవాలన్నారు. యువకుడు.. తప్పక భవిష్యత్తు ఉందని కితాబిచ్చారు. ఈ సందర్భంగా గా ఎమ్మెల్యే ఆదిమూలం, జడ్పిటిసి సుమన్ కుమార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించి ఘనంగా సత్కరించారు.
Post a Comment