పిడుగు పాటుకు దెబ్బతిన్న ఆలయ గోపురం

 పిడుగు పాటుకు దెబ్బతిన్న ఆలయ గోపురం- రాలిన దేవతా విగ్రహాలు



చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలోని ప్రముఖ శ్రీ వేదవళ్ళి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయ గోపురంపై  పిడుగు పడి గోపురం దెబ్బతింది. గురువారం రాత్రి మండలంలో భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మెరుపుల ధాటికి ఉత్తర మాడ వీధిలోని ప్రాకార ఆలయగోపురం పై పిడుగు పడడటంతో గోపురం పై ఉన్న దేవతా విగ్రహాలు చాలా వరకు విరిగి కింద పడ్డాయి.

ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు గమనించి ఆలయ అధికారులకు సమాచారం చేరావేశారు.ఇదిలా ఉండగా ఇటీవల మాడ వీధిలోని ఒక కొబ్బరిచెట్టుపై పిడుగు పడి చెట్టు కాలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. గురువారం గోపురంపై పిడుగు పడి విగ్రహాలు ధ్వంసo కావడంతో భక్తులు కలత చెందుతున్నారు.ఆగమశాస్త్రం ప్రకారం దెబ్బతిన్న గోపురాన్ని పునర్నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.కాగా వేదాలను కాపాడిన వేదనా ర యణుడి సన్నిధిలో కొద్ది సంవత్సరాలనుండి వేద పారాయణుడి నియమించిక పోవడం, ఆలయం లో వేద పారాయణం జరక్క పోవడంతో ఇలాంటి అరిష్టాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget