వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమని సంకేతం ఇస్తోంది?

 వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమని సంకేతం ఇస్తోంది? 


ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అభ్యంతరకర వ్యాఖ్యలుంటే నిలువరించడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉన్నాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీల  కార్యాలయాల పై దాడులు, ఆస్తుల విధ్వంసం, వ్యక్తిగత భౌతిక దాడులకు పాల్పడడం చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంకేతాన్ని ఇస్తుందో ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎంతకైనా తెగిస్తాం అంటూ ప్రజల్లో భయాందోళనలు  రేకిత్తించడమే ఈ ప్రభుత్వం ఉద్దేశమా? గతంలో మంగళగిరిలోని మా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ నిరసనకు సిద్ధమవుతోన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కార్యాలయంలోకి పోలీసు బలగాలతో చొరబడి ఈ ప్రభుత్వం నిలువరించడం జరిగింది. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలోకి రౌడీమూకళ్ళా చొరబడి దాడులకు తెగబడడం పార్టీలకతీతంగా ఖండించాల్సిన విషయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోక పోతే రాష్ట్రం అరాచకంగా మారే అవకాశాలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ అంశాల్లో కఠినంగా వ్యవహరించకపోతే రానున్న రోజులు మరింత దారుణంగా మారుతాయి.     


Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget