టిడిపి కార్యాలయాల పై వైసీపీ జరిపిన దాడులకు దిశా నిర్దేశం చేసింది పోలీసులే , రాష్ట్రం లో పోలీసు వ్యవస్థ పతనావస్థకు చేరింది


 టిడిపి కార్యాలయాల పై వైసీపీ జరిపిన దాడులకు దిశా నిర్దేశం చేసింది పోలీసులే , రాష్ట్రం లో పోలీసు వ్యవస్థ పతనావస్థకు చేరింది -- బీద రవిచంద్ర, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.

టిడిపి కార్యాలయాలపై వైసిపి జరిపిన దాడులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ ను భగ్నం చేసే ప్రయత్నంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ను పోలీసులు హౌస్ అరెస్ట్.. అనంతరం మీడియాతో మాట్లాడటం జరిగింది. 

ఈ సందర్భంగా బీద. రవిచంద్ర మాట్లాడుతూ....

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన, పోలీసు యంత్రాగం పనితీరు ఎలా ఉన్నాయో నిన్నటి ఘటనలు అద్దం పడుతున్నాయి.  నిన్న జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి.   డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో దాడి జరిగితే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. దాడి గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా స్పందనలేదు. చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే అమిత్ షా, గవర్నర్ స్పందించారు, కానీ డీజీపీ స్పందించలేదు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ 50 కార్లలో చంద్రబాబు ఇంటి పైకి వెళ్తే చర్యలు లేవు. ఇప్పుడు టీడీపీ కార్యాయలంపై దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు.  మంత్రి అనిల్ కుమార్ పీఏ పోలీసు వాహనంలో వచ్చి నెల్లూరు టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు.  అనంతపురంలో బాలకృష్ట ఇంటి ముట్టడి చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతికాదు.


టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను డీఎస్సీ వెళ్లిపోండంటూ గౌరవ ప్రదంగా సాగనంపారంటే దీనికి పోలీసులు సహకరించినట్టే కదా. శాంతియుత నిరసనలను చేసే టీడీపీ నేతల్ని ముందస్తు గా అడ్డుకుంటున్న పోలీసులు, మారణాయుధాలతో వైసీపీ చేస్తున్న దాడులను ఎందుకు అడ్డుకోవటం లేదు. పోలీసులు మఫ్టీ లో ఉండి ఆఫీసులో రెక్కీ నిర్వహిస్తున్నారు. అనుమాస్సదంగా తిరుగుతున్న వారిని పట్టుకుంటే పోలీసులమని చెప్పారు. పోలీసులు తమ పనితీరు మార్చుకోవాలి. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్, చంద్రబాబు నాయుడుపై ఏ విధంగా మాట్లాడారో ప్రజలకు తెలీదా?  ఎప్పుడు ఒకే పార్టీ అధికారం ఉండదన్న విషయం పోలీసులు గమనించాలి. రాష్ట్రంలో నిరసన తెలిపే స్వేచ్చ కూడా లేదా?  ఏపీ నుంచి తెలంగాణకు గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని తెలంగాణ పోలీసులు చెప్పింది నిజం కాదా ?  ఎన్టీఆర్ ‍హయాం నుంచి చంద్రబాబు వరకు టీడీపీ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడుతూ వచ్చింది. టీడీపీకి ఇలాంటివి కొత్తకాదు,  వైయస్ హయాంలో కూడా ఇలాంటి దాడులు చాలా చూశాం. వీటికి భయపడే ప్రసక్తే లేదు.   వైసీపీకి వస్తున్న వ్యతిరేకత , మద్యం, డ్రగ్ మాఫియా నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు దాడులకు తెగబడుతున్నారు.




Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget