పెరిగిన ధరలను అరికట్టాలని నిరసన ర్యాలీ - సిపిఎం*
నిరసన ర్యాలీలో పాల్గొన్నసిపిఎంనాయకులు.
04-10- 2021. కావలి.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్, కరెంటుచార్జీలనుతగ్గించాలని మరియు చెత్త పన్ను, ఇతర యూజర్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఉదయగిరి రోడ్డు సెంటర్,నుండిప్రదర్శనబయలుదేరి, గాంధీ బొమ్మ సెంటర్, కోర్ట్ సెంటర్, అంబేద్కర్ బొమ్మ, ఆర్టీసీ మీదుగా ఆర్డీవో ఆఫీస్ కి చేరి అనంతరం ఆందోళన చేసి,ఆర్డీవో గారికి అర్జీని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్, పి . శ్రీరాములు గార్లతో పాటు కావలి సిపిఎం పట్టణ కార్యదర్శి పి . పెంచలయ్య సిఐటియుజిల్లానాయకురాలు ఎస్.కె. రెహనాబేగంలు పాల్గొనిమాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలనుఅవలంబిస్తున్నారనితీవ్రంగాదుయ్యబట్టారు. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల నిత్యావసర వస్తువులు పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్, కరెంటుఛార్జీలువిపరీతంగా పెంచిప్రజలమీదమోయలేనిభారాలుమోపుతున్నారని పెరిగిన ధరలతో ప్రజలు కొని తినలేని పరిస్థితి లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాతరైతుకార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిందనిప్రభుత్వ రంగసంస్థలనుప్రైవేటీకరించడంలక్షలమందికార్మికులను వీధులపాలుచేస్తోందని కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ అనేకమందిరైతులు,కార్మికులు చనిపోతున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం స్పందించి సమస్యలనుపరిష్కరించకుండా పోరాటాలను అణచివేసే ధోరణితో పరిపాలన సాగిస్తున్నారని విమర్శిస్తున్నారు.ఈ పోరాటాలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాయనిహెచ్చరించారు. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ విధానాలనుఅమలు చేస్తూ మన రాష్ట్రంలో కరెంటు చార్జీలు, ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను పెంచి ప్రజల నుండి ఖజానా నింపుకోవాలని చూస్తున్నదని అన్నారు. ప్రజలపై భారాలుమోపనని చెప్పి అధికారంలోకివచ్చిన ముఖ్యమంత్రిగా వచ్చిననాటినుండిరకరకాల పేరుతో ప్రజలపైభారాలు మోపుతున్నారని కరోన కష్ట కాలంలో ప్రజలు ఉంటే ఆదుకోవాల్సిన రెండు ప్రభుత్వాలు అదుకోకుండా ప్రజలపై భారాలపై భారాలు మోపడం ఇది ఎంతవరకు న్యాయమని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా అన్ని రకాల పెరిగినధరలు, చార్జీలు తగ్గించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించకపోతేప్రజాపోరాటాలు ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధిచెబుతాయనిహెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్.కె అమీర్,భాషా,వై.కృష్ణమోహన్,పి .పెంచలనరసింహం,జి.మధుసూదనరావు,పి.సుబ్రమణ్యం,బి.వెంకటేశ్వర్లు, పి .సత్యనారాయణ సిఐటియు నాయకులు వై. రవి,ఆనందరావు,మాలకొండయ్య,టీ .శీనయ్య,పి .జేమ్సడి.వై.ఎఫ్.ఐ.నాయకులు పి . కోటేశ్వరరావు, క్రాంతికుమార్,శివకోటయ్య,ఓ.రమేష్,భాస్కర్,మహి ళా నాయకులు పి. అనిత, పి .చిన్నమ్మ,సునీత,జ్యోతి, అనురాధ, మంగమ్మ తో పాటు ప్రజలు కార్మికులు పాల్గొన్నారు
Post a Comment