వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపు వైఖరితో రైతులు,ప్రజలకు ఇక్కట్లు - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల పై న్యాయపోరాటానికి కార్యాచరణ రూపకల్పన నిమిత్తం అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, రైతు సంఘాల నాయకులతో సాగునీటి వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాల కృష్ణ అధ్యక్షతన సమావేశం
రెండున్నరేళ్లుగా బిల్లులు చెల్లించకుండా వేధించడంపై ఆవేదన
సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీఎమ్మెల్యేలు బిసి జనార్దనరెడ్డి ,కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రైల్వేకోడూరు ఇన్ చార్జి పంతగాని నరసింహ ప్రసాద్, రైతు సంఘ నాయకులు కుర్రా నరేంద్ర
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు అన్ని విధాలా నష్టపోయారు రాష్ట్రవ్యాప్తంగా నీరు-చెట్టు పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి రూ.1277 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ లో పెండింగ్ లో ఉన్నాయి..మరో 500 కోట్ల రూపాయల వరకు జనరేట్ కాని బిల్లులు ఉన్నాయి.. బిల్లుల కోసం న్యాయపోరాటం చేపట్టబోతున్నాం
Post a Comment