విత్తన నిల్వ మరియు శుద్ధీకరణ గోదాముకు శంకుస్థాపన చేసిన పేర్నాటి దంపతులు










విత్తన నిల్వ మరియు శుద్ధీకరణ గోదాముకు శంకుస్థాపన చేసిన పేర్నాటి దంపతులు


 కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ రోజు నెల్లూరు పార్లమెంటు కావలి నియోజకవర్గ పరిధిలోని కావలి మండలం, రుద్రకోట  గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న విత్తన నిల్వ మరియు శుద్ధీకరణ గోదాము శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ పేర్నాటి హేమ సుష్మిత గారు

 ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో పేర్నాటి హేమ సుష్మిత గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 33 విత్తన నిల్వ కేంద్రాలు, మరియు శుద్దీకరణ గోదాములను ఏర్పాటు చేసేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారని అందులో భాగంగా ఈరోజు మూడవ విత్తన నిల్వ మరియు శుద్ధీకరణ గోదామును కావలి నియోజకవర్గంలో శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉంటూ, నాణ్యమైన విత్తనాలను అందిస్తూ, రైతులు పండించిన పంటను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులు వాళ్ళ పంటను నిల్వ చేసుకునేందుకు వీలుగా విత్తన నిల్వ గోదాములను నిర్మించడం జరుగుతుందని, ప్రస్తుతం వరి విత్తనాలకు కు కిలోకి 5 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో కిలోకి పది రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారని తెలిపారు.  మన రాష్ట్రానికి సంబంధించి మొక్కజొన్న, వేరుశనగ, పెసలు, మినుము అంతర పంటలకు సంబంధించిన విత్తనాలను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి సబ్సిడీని మన ముఖ్యమంత్రి గారు రైతులకు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి మార్కెట్ యార్డ్ చైర్మన్ సుకుమార్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్, మరియు అధికారులు నాయకులు పాల్గొన్నారు.













Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget