వాడవాడలా మాజీ కేంద్రమంత్రి పనబాక జన్మదిన వేడుకలు పనబాక జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు 4 సార్లు పార్లమెంట్ సభ్యురాలు గా,రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక అన్నీ వర్గాల ఆశ జ్యోతి పనబాక అభివృద్ధికి కేర్ ఆఫ్ గా పనబాక పనబాక యువసేన నేతలు వెల్లడి
ఆంధ్రప్రభ✍️మీజూరు మల్లి✍️: కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి జన్మదినం సందర్భంగా పనబాక యువ సేన, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం కోట పట్టణంలోని విమల్ సిల్కు హౌస్‌లో పనబాక యువ సేన నాయకులు, టీడీపీ నేతలు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, వాక భాస్కర్ రెడ్డి, మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మీజూరు మల్లికార్జున రావు, షేక్ తాజుద్దీన్,షేక్ షంషుద్దీన్, పల్లె మల్లు వెంకట కృష్ణా రెడ్డి పనబాక అభిమానులు పాల్గున్నారు.
ఈ సందర్భంగా పనబాక యువ సేన నేతలు మాట్లాడుతూ మాజీ కేంద్రమంత్రి డాక్టర్ పనబాక లక్ష్మీ 63వ జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా వాడ వాడలా జన్మదిన వేడుకలు జరుపుతున్నారనీ అందులో భాగంగా కోట పట్టణంలో భారీ ఎత్తున పనబాక లక్ష్మీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామనీ తెలిపారు.
పనబాక అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే పనబాక అనే విధంగా నెల్లూరు జిల్లాలో ఆమె మార్కు స్వష్టంగా కనిపిస్తుంది అన్నారు. గూడూరు నుండి సికింద్రాబాద్ కు సింహపురి ట్రైన్ ఏర్పాటు ఆమె పుణ్యమే అనీ తెలిపారు, నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు, బ్రిడ్జిలు, తాగునీటి పైపులైన్, వాటర్ ట్యాంక్‌లు, విశ్రాంతి భవనాలు, సీసీ రోడ్లు, పక్కా గృహాలు, ఫ్లై ఓవర్ బ్రిడ్జ్, కండలేరు డ్యామ్ నుండి గూడూరుకి నీటి సరఫరా వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అనీ అందుకే ఆమెను పనిచేసే లక్ష్మీ పనబాక లక్ష్మీగా కీర్తి ప్రతిష్టలుఅందుకున్నారన్నారు అని వెల్లడించారు
పనబాక లక్ష్మిఒక్క గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు 800 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారనీ వారు వెల్లడించారు. గాంధీ కుటుంబంతో వారికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిన విషయమే అనీ 2024 లో పనబాక పూర్వపు వైభవం పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వసనీయత రాజకీయాలు చేస్తూ, నమ్మిన వారిని ఆదరిస్తున్న పనబాక లక్ష్మీ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు అన్నారు.
పనబాక లక్ష్మీ, కృష్ణయ్య దంపతులు కోట మండలం లో చేసిన అభివృద్ధి వలన నేడు రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతోబ్రతుకుతున్నారు అనీ తెలిపారు, ఎన్ని ఆటుపోట్లు వచ్చిన మనోధైర్యం తో రాజకీయాలు చేస్తున్న పనబాక లక్ష్మీ ఆంధ్ర ఉక్కు మహిళ గా ,పనిచేసే లక్ష్మీ పనబాక లక్ష్మీ గా పేరు ప్రఖ్యాతులు గడించారు అని వారు వెల్లడించారు,ఈ జన్మదిన వేడుకలలో టీడీపీ నేతలు, పనబాక అభిమానులు బూసి సుబ్రమణ్యం, రాంమోహన్, కోట గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment