"వ్యవసాయంపై కాకాణి సమీక్ష"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నందున నియోజకవర్గ వారీగా వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎరువులు, విత్తనాల డీలర్లతో పాటు, రైతులతో కలిసి సమీక్ష నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, విస్తారంగా వర్షాలు కురవడంతో రైతాంగానికి సాగునీటి సమస్య లేకుండా పోయింది. ఇరిగేషన్ శాఖ అధికారులు పొలాలకు సజావుగా, సాఫీగా నీరందించేందుకు అవసరమైన మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చెయ్యండి. రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమృద్ధిగా సాగునీరు అందించే బాధ్యత ఇరిగేషన్ శాఖ అధికారులదే. వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలతో రైతుల మోసపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నియంత్రించాలి. నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు అమ్ముతూ, రైతాంగం పట్ల మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. సచివాలయాలలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ లకు బాధ్యతలు అప్పజెప్పి, ఎరువులు నకిలీ విత్తనాల బెడద నుండి రైతులను కాపాడాలి. రైతులు సాగు చేసే పంట విస్తీర్ణాన్ని అధికారిక లెక్కలతో పాటు, అనధికారికంగా సాగు చేసే దానిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. రైతులు పండించే ధాన్యాన్ని ముందుగానే మదింపు చేసుకొని, అందుకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైస్ మిల్లులను జత చేయాలి. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు సమన్వయంతో పని చేసి, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. రైతులు వరినాట్లు వేసుకునే ముందు ప్రభుత్వం కొనుగోలు చేయని రకాల పట్ల అవగాహన కల్పించి, కొనుగోలు చేసే రకాలను మాత్రమే వేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. రైతులు వరినాట్లు వేసుకునే దగ్గర నుండి, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేవరకు నిత్యం అందుబాటులో ఉంటూ, నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహిద్దాం.
Post a Comment