చిట్టమూరు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మి
హాజరైన కాకాని, వెలగపల్లి,మేరుగ, బాలచంద్రారెడ్డి
జనతా సేవకుడు..జనం మెచ్చిన నాయకుడు..
విజయాల వారసుడు సన్నారెడ్డి
చిట్టమూరు మండల అధ్యక్షురాలిగా సన్నారెడ్డి విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. వైకాపా నుంచి చిట్టమూరు మండలం యాకసిరి ప్రాదేశిక నియోజకవర్గ సభ్యురాలిగా, పార్టీ మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి తల్లి విజయమ్మ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఆమెను ఎంపీపీగా ఎన్నుకున్నారు. బుధవారం వైకాపా జిల్లా అధ్యక్షులు,సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మేరుగ మురళీధర్,సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, వైకాపా రాష్ట్ర రైతు కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి,పార్టీ స్థానిక నేతలు,అదికారులు పలువురు హాజరై విజయలక్ష్మమ్మను పూలమాలలు, శాలువాలతో సన్మానించి, సత్కరించారు. బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో క్రియాశీలకంగా, సమర్థవంతంగా పార్టీ అభివృద్ధే ధ్యేయంగా శ్రీనివాసులురెడ్డి కట్టుబడి పని చేశారన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, సర్పంచ్, జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా జెండాను మండలంలో రెపరెపలాడించిన ఘనత సన్నారెడ్డిదేనన్నారు. పార్టీకి మొదటి నుండి కష్టపడి విధేయతగా ఉన్న వారిని గౌరవించి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పదవి కట్టబెట్టడం జరిగిందన్నారు.రాజకీయాలలో పదవి ఆశించడం సహజమన్న ఆయన భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు పార్టీకి నష్టం కాకుండా అంటిపెట్టుకోవాలని, అందరికీ అవకాశం ఖచ్చితంగా వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకొని అభిప్రాయభేదాలు రాకుండా అంతా కుటుంబంలా ముందుకు సాగాలన్నారు. స్థానిక నాయకులు, ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు అభిప్రాయం మేరకు జగన్మోహన్ రెడ్డి విజయలక్ష్మికి పదవిని కట్టబెట్టడం జరిగిందన్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారికి విలువిచ్చామన్నారు.పార్టీ తల్లి లాంటిదని అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.
జనతా సేవకుడు..జనం మెచ్చిన నాయకుడు..విజయాలకు వారసుడు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అని ఈ సందర్భంగా వైకాపా నాయకులు పలువురు అన్నారు.
బాధ్యతగా పని చేస్తాం సన్నారెడ్డి
తమపై నమ్మకం ఉంచి కట్టబెట్టిన పదవిని బాధ్యతగా పనిచేస్తామని వైకాపా మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. పార్టీ అభివృద్ధే ప్రాణంగా పనిచేశానన్న ఆయన, నాపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ అన్ని సర్దుకుంటాయని కూడా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చిప్పల వెంకటయ్య, ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య, కోఆప్షన్ సభ్యులు ఎస్ కె మస్తాన్ సాహెబ్,ఎంపీటీసీలు, సర్పంచులు,నాయకులు రాజారామి రెడ్డి,కామిరెడ్డి కస్తూరి రెడ్డి, పోచారెడ్డి సుకుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి,మనోహర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి వంకా రమణయ్య,లోకేష్ రెడ్డి,యంపిడిఓ సురేష్ బాబు, తహసీల్దార్ మునిలక్ష్మి, అధికారులు పలువురు పాల్గొన్నారు.
Post a Comment