టీడీపీ జాతీయ కార్యాలయంలో నీరు – చెట్టు ఫిర్యాదుల విభాగాన్ని సందర్శించిన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నీరు – చెట్టు పథకం కింద పెండింగ్ బిల్లులకు సంబంధించిన బాధితుల ఫిర్యాదుల విభాగాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సందర్శించారు.
గడిచిన రెండున్నరేళ్లుగా కక్షపూరితంగా నీరు – చెట్టు పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి రూ.1277 కోట్లు సీఎఫ్ఎంఎస్ లో టోకెన్ పడి పెండింగ్ లో పెట్టడం వలన సన్న, చిన్న కారు రైతులు, నీటి సంఘాల ప్రతినిధులు అప్పులపాలయ్యారు.
అందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీరు – చెట్టు కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించిన వివరములను త్వరితగతిన సేకరించి బాధితులకు అండగా నిలవాలన్నారు.
అనంతరం నీరు – చెట్టు ఫిర్యాదుల విభాగం బాధ్యులు సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ..
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దేశంలోని తొలిసారిగా నీరు – ప్రగతి కింద చిన్న నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల నుంచి రూ.18,265 కోట్లు ఖర్చు పెట్టి చెరువులు, కాలువల పూడిక తీత, పంట కుంటల నిర్మాణం, చెక్ డ్యాంలు, గొలుసుకట్టు చెరువులు తదితర నీటి సంరక్షణ చర్యలు చేయడం వలన 98 కోట్ల మీటర్ల పూడిక మట్టిని తొలగించడం వలన 90 టీఎంసీలు భూగర్భ జలాలుగా మార్చబడి రాష్ట్ర వ్యాప్తంగా 6.795 లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా స్థిరీకరించబడింది.
గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి దీని వలన 9 మెరిట్ స్కాచ్ అవార్డులు వచ్చాయని అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. టోకెన్ పడినవి కాక సుమారు రూ.800 కోట్ల జెనరేట్ కాని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర, నీరు – చెట్టు రాష్ట్ర కో – ఆర్డినేషన్ కమిటీ సభ్యులు మైనేని మురళీ కృష్ణ, యనమద్ది పుల్లయ్య చౌదరి, చెన్నుపాటి శ్రీధర్, కవులూరి రాజా, మరిడి వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment