విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి ఎంవీఐ మురళీమోహన్
గూడూరు : విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ మురళీమోహన్ అన్నారు. సోమవారం గూడూరు పట్టణంలోని షాదీమంజిల్ లో మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. పేద విద్యార్థులు ఆర్థికంగా ఎదిగేందుకు చదువొక్కటే ఏకైక ఆయుధమన్నారు. మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లిం విద్యార్థుల అభ్యున్నతికి ఉపకార వేతనాలు, విద్యా సామాగ్రి, స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. నెట్ వర్క్ గౌరవాధ్యక్షులు, సీనియర్ లయన్ షేక్. రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ మైనారిటీలు విద్యలో వెనుకబడకూడదనె లక్ష్యంతో నెట్ వర్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిరుపెద ముస్లిం బాలలకు ఖత్నా (ఒడుగుల) నెట్ వర్క్ అధ్యక్షులు ఎండీ. అబ్దుల్ రహీం మాట్లాడుతూ మైనారిటీలలో బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మరి కొంతమంది నెట్ వర్క్ సభ్యులు ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్, విద్యా సామాగ్రి, పంపిణీ చేశారు. అలాగే విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎండీ. ఇస్మాయిల్ జ్ఞాపకార్థం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎంవీఐ మురళీమోహన్ ను నెట్ వర్క్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు షేక్. కాలేషా, అధ్యక్షులు ఎండీ. అబ్దుల్ రహీం, గౌరవాధ్యక్షులు షేక్. రియాజ్ అహ్మద్, కమిటీ సభ్యులు షేక్. మహబూబ్ బాష, షేక్. రియాజ్ అహ్మద్, ఎండీ. అన్వర్ బాష, అప్సర కరీముల్లా, ఎండీ. రవూఫ్ అహ్మద్, షేక్. నాజర్, షేక్. షానవాజ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment