మంత్రి మేకపాటి ఇలాకాలో మెగా జాబ్ మేళా
ఈ నెల 30న నిర్వహించే జాబ్ మేళాకు తరలి రానున్న ప్రఖ్యాత కంపెనీలు
భారీ స్థాయిలో నిర్వహణ
1000 కి పైగా ఉద్యోగ అవకాశాలు
మెట్ట ప్రాంత యువతీ యువకులకు సువర్ణవకాశం
మహిళలకు ప్రత్యేక అవకాశం
నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు నడుం బిగించారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా మరో భారీ జాబ్ మేళా నిర్వహణకు సిద్ధమయ్యారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బిటెక్, డిప్లమా ఇన్ మెడికల్, ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ లాంటి వివిధ చదువులు పూర్తి చేసిన యువతీ యువకుల కోసం *ఆత్మకూరులో *ఉద్యోగ మేళా ఈనెల 30వ తేదీన నిర్వహించ బడును.*
ప్రభుత్వంలోకి రాగానే యువతకు సుమారు 6 లక్షల ఉద్యోగాలు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో పేరున్న అపెక్స్ సొల్యూషన్ లిమిటెడ్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, అపాచీ, హీరో, ఇసుజి, రైజింగ్ స్టార్స్ మొబైల్స్, అమర్ రాజా బ్యాటరీస్, హెట్రో డ్రగ్స్, టాటా స్టీల్, అపోలో ఫార్మసీ, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, మెడికవర్ హాస్పిటల్, సౌత్ ఇండియా బ్యాంక్, టాటా స్కై, Chola ms general insurance, Noveau Medicament, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫోన్ పే, లాంటి ప్రఖ్యాత కంపెనీలలో ఉద్యోగాలందించేందుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. *ఈ జాబ్ మేళాలో సుమారు వెయ్యికి పైగా యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును.
ఈ జాబ్ మేళాను ఆత్మకూరు నియోజకవర్గం తోపాటు నెల్లూరు జిల్లాలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
Post a Comment