టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాడిని ఖండిస్తున్నాం మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ధ్వజం



 రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన 

టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాడిని ఖండిస్తు గూడూరులోనిరసనలు 

 ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం 

 నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి 

 ప్రజాస్వామ్యంలో ఏమిటి ఈ రాక్షసతత్వం 

 ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి 

 మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆగ్రహం 

 ఆంధ్రప్రభ✍️మీజూరు మల్లి✍️: టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాదాపు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం హేయమైన చర్యలు అనిమాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ధ్వజమెత్తారు, మంగళవారంటీడీపీ నేత పట్టాభి నివాసంపైదాడిని ఖండిస్తు గూడూరు లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు, ఎన్టీఆర్ విగ్రహానికిప్రజాస్వామ్య న్నీ రక్షించాలి అని వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూటీడీపీ నేత పట్టాభి నివాసంపై దాదాపు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో పాటు విలువైన వస్తువులను కూడా ధ్వంసం చేశారు అని తెలిపారు. 

 దాడి సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో పట్టాభి ఉన్నారు అని తెలిపారు. పట్టాభి ఇంటిపై దాడిజరిగిందని పట్టాభికి భార్య, కూతురు ఫోన్‌ చేసి చెప్పారు. వైసీపీ నేతలే దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. గంజాయి వ్యవహారంపై మంగళవారం టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీ నేతలపై పట్టాభివిమర్శలుచేశారు. ఘటనాస్థలిలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు అని. దాడి సమయంలో ఇంట్లో కేవలం పట్టాభి ఐదేళ్ల కూతురు, పనిమనిషి, డ్రైవర్ ఉన్నారు. దాడి జరుగుతుండగా పట్టాభి కూతురిని బాత్‌రూమ్‌లో దాచిన పని మనిషి డ్రైవర్ మెడపైకత్తిపెట్టిచంపేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది అన్నారు. 

 వెంటనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవాలి డిమాండ్ చేశారు, ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు కొండూరు వెంకటేశ్వర్లు రాజు, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రథినిధి బిల్లుచెంచురామయ్య, తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి, కార్యదర్శి గుండాల భారతి, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఇస్రాయెల్ కుమార్, నియోజకవర్గ ఎస్సి సెల్ అద్యక్షులు ఏసుపాక పెంచలయ్య,మండల కమిటీ సభ్యులు పెంచలరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, నారాయణ రెడ్డి,రంగా రెడ్డి, కృష్ణ రెడ్డి,నాగూర్, మండల ఎస్సి సెల్ అద్యక్షులు బట్టేపాటి కృష్ణయ్య, మండల మహిళా కమిటీ అద్యక్షులు మల్లి శ్యామల,టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget