నెల్లూరు మత్స్యకారులు ఘర్జన సభలో ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన బిజెపి అధినాయకులు
నెల్లూరు : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మత్స్యకారుల జీవన విధానాన్ని ప్రభుత్వం నాశనం చేస్తుంది.. జిఓ నెంబర్ 217 ను తీసుకొచ్చే హక్కు సీఎం జగన్ కి లేదు.. జిఓ నెంబర్ 217 ను రద్దు చేసేవరకు తాడోపేడో తేల్చుకునేందుకు బీజేపీ సిద్దంగా ఉంది. ఏపీ బడ్జెట్ లో మత్స్యకారుల కోసం ప్రభుత్వం కేవలం 90 కోట్లు కేటాయించింది..ఏపీలో జట్టీలు కట్టకపోవడం వల్ల మత్స్యకారులు అందరూ ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు.. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు తమ కుటుంబాల కోసం రాజకీయాలు చేస్తున్నారు..మత్స్యకారులు జీవన విధానాన్ని మార్చే బాధ్యత బీజేపీది.
నెల్లూరు : ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోదర్ మూడు సార్లు సీఎంగా... రెండోసారి ప్రధానిగా చేస్తున్న మోడీకి మత్స్యకారుల సమస్యలపై అవగాహన ఉంది.. 20 వేల కోట్ల రూపాయలు కేటాయించి.. ఒక మత్స్యకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసారు..టీడీపీ, వైసీపీలు మత్స్యకారుల కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చెయ్యలేదు..కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులను సీఎం జగన్ నవరత్నాల కు వాడుకుంటుంటే.. ప్రభుత్వంలో మాజీ సీఎం చంద్రబాబు తన పేరు మీద పథకాలు పెట్టుకున్నాడు..ప్రధాని మోదీ మత్స్యకారులకు అనేక పథకాలు ప్రవేశపెడితే.. సియం జగన్ మత్స్యకారులకు స్టిక్కర్లు మాత్రమే ఇచ్చాడు..బిసి సామాజిక చెందిన మోదీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీకే చెందుతుంది..ఏపీ జల సరిహద్దులలోకి తమిళనాడు జాలరులు వస్తున్నారు.. దానికి అడ్డుకట్ట వేయాలి.. వారిపై చర్యలు తీసుకోవాలి..
నెల్లూరు : కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎల్ మురుగన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మత్స్యకారులను పట్టించుకు న్న ఏకైక ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం మాత్రమే..మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుంది..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 వేల కోట్లు మత్స్యకార సంక్షేమ నిధి విడుదల చేశారు.. జీవో నెంబర్ 217 రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం మేరకు కృషి చేస్తా..రాష్ట్ర మత్స్య శాఖ అధికారులను ఢిల్లీకి పిలిపించి జీవో నెంబర్ 217 రద్దుపై చర్చిస్తాం..పూడిపోయిన పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని తెరిపించేందుకు కృషి చేస్తా.. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఏర్పడిన వివాదాలను త్వరలోనే పరిష్కరిస్తాం...
Post a Comment