ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పై..
చేజర్ల సుబ్బారెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదం..
జలదంకి మండల వైఎస్సార్ సీపీ మహిళా నేత...
తిప్పారెడ్డి ఇందిరమ్మ..
ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మెట్టప్రాంత రైతుల ఆశాజ్యోతి, నిరంతర అభివృద్ధి శ్రామికులు, ఉదయగిరి నియోజకవర్గం ప్రజలచే నాలుగు పర్యాయాలు శాసససభ్యునిగా ఎన్నుకోబడ్డ మంచి మనిషి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పై.. ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం హాస్యాస్పదం అని ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జలదంకి మండల వైఎస్సార్ సీపీ మహిళా నేత తిప్పారెడ్డి ఇందిరమ్మ తీవ్రస్థాయిలో హెచ్చరించారు..
మంగళవారం జలదంకి లో తిప్పారెడ్డి ఇందిరమ్మ తన నివాసంలో జలదంకి మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖాజారహంతుల్లా, గోపన్నపాలెం సర్పంచ్ గండు వెంకారెడ్డి లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇందిరమ్మ మాట్లాడుతూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గo లోని 8 మండలాల్లో నాయకులని సమన్వ్యంతో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. మేకపాటి పార్టీ ని అభివృద్ధి చేయలేదని మీరు అనడం మీ ముర్కత్వం అన్నారు. మేకపాటి నిన్ను దగ్గరికి చేర్చి రాజకీయంగా అనేక పదవులు ఇచ్చి ఒక నాయకుడు గా పెంచి ప్రయోజకుల్ని చేసిందని గుర్తు చేశారు. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు గా మేకపాటి ని విమర్శిస్తూ ఉన్న నీ ప్రవర్తన పద్ధతిగా లేదని దీన్ని మార్చుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్పేందుకు ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలాల్లో ని వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మా అభిమాన నాయకుల పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని ఇలాంటి మరల పునరావృతం అయితే మేకపాటి అభిమానులు సహించబోరని ఆమె హెచ్చరించారు...
ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూలు చైర్మన్ దగుమాటి శ్రీకాంత్ రెడ్డి, గున్నంరెడ్డి కృష్ణా రెడ్డి, వాక శ్రీనివాసులురెడ్డి, వెంకారెడ్డి, దగుమాటి హాజరత్ రెడ్డి, గండు రఘు రామిరెడ్డి, పులిమి మాల్యాద్రి రెడ్డి, చేజర్ల ఉమామహేశ్వరరావు, ఇరగాల సత్యనారాయణ రెడ్డి పోలూరు చంద్రకాంత్, కోటయ్య, శ్రీనివాసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Post a Comment