హిందువుల ప్రధాన పండుగలలో విజయ దశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయ దశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది.అందులో భాగంగా కోటగ్రామం లో వేలసియున్న శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో కోటమ్మ తల్లి- వైష్ణవి దుర్గాదేవి అమ్మ వార్ల కు ఆలయ ట్రస్ట్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సావాలు జరుగుతున్నాయి.
తొలిరోజు- శైలపుత్రి రూపంలో వైష్ణవి దుర్గాదేవి- కోటమ్మ తల్లి
శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్!, వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్!!..
నవరాత్రుల్లో గురువారం మొదటిరోజు కోట లోని కోటమ్మ తల్లి, వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్లు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తు భక్తులకు దర్శనమిచ్చారు.
రెండో రోజు- బాలాత్రిపుర సుందరీ రూపంలో వైష్ణవి దుర్గాదేవి- కోటమ్మ తల్లి
శ్లోకం: హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్!!
రెండో రోజు శుక్రవారం కోటలోని కోటమ్మ తల్లి- వైష్ణవి దుర్గాదేవి అమ్మ వార్లు పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజచేస్తారు. త్రిశతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి అనీ భక్తులు విశ్వాసము
Post a Comment