అంతరిక్ష రంగంలో ఇస్రో మన దేశం నిజంగా గర్వించదగ్గ గొప్ప సంస్థని --- తెలంగాణ రాష్ట్ర గవర్నర్




నెల్లూరు  : అంతరిక్ష రంగంలో ఇస్రో మన దేశం నిజంగా గర్వించదగ్గ గొప్ప సంస్థని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్  తమిళసాయి సౌందరరాజన్ పేర్కొన్నారు సోమవారం ఉదయం వారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట లో వెలసి వున్న శ్రీ చెంగాలమ్మ దేవస్థానాన్ని దర్శించుకుని పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం వారు శ్రీహరికోటలోని షార్ సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం చేరుకుని అక్కడి ఎం.ఆర్.కే. ఆడిటోరియంలో చిన్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల లో ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించారు. తదనంతరం గవర్నర్ వారోత్సవాల టీజర్ వీడియోను ఆవిష్కరించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా  గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు.  అంతరిక్ష పరిశోధన,  అన్వేషణలో చాలా సంవత్సరాలుగా మనకు గొప్ప వారసత్వం ఉందన్నారు.  అంతరిక్ష రంగంలో ఇస్రో మనదేశం నిజంగా గర్వించదగ్గ గొప్ప సంస్థ అని ప్రశంసించారు.  ఇస్రో అంచలంచలుగా ఎదిగి జిఎస్ఎల్వి మార్క్-3 ప్రయోగ స్థాయికి చేరుకుందన్నారు.  ఇస్రో పితామహు లైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధావన్,  డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తదితర దిగ్గజాలు అందించిన విశిష్ట సేవలను మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.   వారందించిన స్ఫూర్తి, విశిష్ట సేవలు  అభినందనీయమన్నారు.  డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కన్న కలలను ప్రొఫెసర్ సతీష్ ధావన్ సాకారం చేశారన్నారు. 1957 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన తొలిసారిగా మానవులు రూపొందించిన భూ ఉపగ్రహం  స్పుత్నిక్ -1 ప్రయోగించిన దృష్ట్యా 1999 లో ఐక్యరాజ్యసమితి  జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జరపాలని ప్రకటించిందన్నారు.  ఈ సంవత్సరం ఈ వారోత్సవాల్లో అంతరిక్షంలో మహిళలు అనే అంశంపై చాలా ప్రత్యేక  దృష్టి సారించడం చాలా సంతోషంగా ఉందన్నారు.  అంతరిక్ష శాస్త్రంలో లో మహిళల పాత్ర ప్రోత్సహించడానికి,  గుర్తించడానికి  ఈ అంశం సరైనదిగా భావిస్తున్నానన్నారు.  మహిళల పట్ల చూపే గౌరవ మర్యాదలు ఆదేశం ప్రగతికి మంచి  కొలమానాలను అని స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.  ఇస్రోలో మహిళలకు గౌరవం ఇచ్చి అన్ని కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతరిక్ష ప్రయోగ సమయంలో కంట్రోల్ రూమ్ నందు విధంగా విధులు నిర్వహిస్తున్న మహిళలను చూసినప్పుడు సంతోషం కలిగిందని  ఇందుకు డాక్టర్ స్వాతి మోహన్ ఇండియన్ అమెరికన్ స్పేస్ సైంటిస్ట్ చర్యలను ను ఉదహరించారు. అంతరిక్ష పరిశోధనలో భారతీయ మహిళల ఆసక్తి,  ధైర్యసాహసాలు విదేశాలలో సైతం కనపరచడం అభినందనీయమని,  ఇందుకు దిగ్గజాలయిన కల్పనా చావ్లా సునీత విలియమ్స్ ను పేర్కొనవచ్చన్నారు.  అంతేకాకుండా ఇటీవల తెలుగు మహిళ శిరీష బండ్ల అంతరిక్షంలో ఎగిరి మూడవ మహిళగా చరిత్ర సృష్టించిందన్నారు. అంతరిక్ష పరిశోధన,  అన్వేషణ,  ప్రయాణంలలో వారు రోల్ మాడల్గా నిలిచారన్నారు.   వారు సృష్టించిన చరిత్రతో  మరెంతో మంది యువతులు అంతరిక్ష రంగంలో అడుగు పెట్టేందుకు స్ఫూర్తినిచ్చిందన్నారు.  ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ముఖ్య ఉద్దేశం అంతరిక్ష సాంకేతికత దాని ప్రయోజనాలను విస్తృతంగా తెలియజేయడమేనన్నారు.  ముఖ్యంగా విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనపై  అవగాహన కలిగించే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్,   తెలంగాణ, తమిళనాడు,  పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఆన్లైన్ ద్వారా వివిధ పోటీ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.  గత కొన్ని సంవత్సరాలుగా ఇస్రో  ఎన్నో ఉపగ్రహాలను  నింగిలోకి ప్రయోగించి గణనీయమైన సేవలు అందించిందని వారు కొనియాడారు.  ఉపగ్రహ పరిశోధన ద్వారా విపత్తుల నిర్వహణ,  వాతావరణం ముందస్తు హెచ్చరికలు, మత్స్యకారులకు సూచనలు,  ఓషణోగ్రఫీ, టెలీమెడిసిన్  టౌన్ ప్లానింగ్,  సమాచార వ్యవస్థ,  డిటిహెచ్,  మొబైల్ ఫోన్ కనెక్షన్ వంటి విస్తృత సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.  భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ కలలు కన్నట్లుగా భారతీయ రోదసీ కులు అంతరిక్షంలో అడుగు పెట్టేందుకు చేస్తున్న కృషి గర్వించదగ్గ విషయమని అందులో భారతీయ  ఆస్ట్రోనాట్ గా మహిళ ఉంటే చాలా సంతోషమని వారు అన్నారు. అప్పటి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ , ప్రొఫెసర్ సతీష్ధావన్ నుండి నేటి ఇస్రో చైర్మన్ డాక్టర్  శివన్ వరకు వేలాది మంది ఇస్రో ఉద్యోగులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. అంతకుమునుపు షార్ డైరెక్టర్ శ్రీ ఏ రాజ రాజన్, సార్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రగతిని వివరించారు వారోత్సవాల కమిటీ చైర్మన్  డాక్టర్ ఆర్.వెంకటరామన్ వారోత్సవాల వివరాలను ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలియజేశారు. గవర్నర్ గారు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను వివరించి కొనియాడారు. తదుపరి గవర్నర్ గారికి షార్ డైరెక్టర్  జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో షార్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ ఎం బి ఎన్ మూర్తి, కంట్రోలర్ శ్రీ ఎం శ్రీనివాసులు రెడ్డి, సంయుక్త కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్, అదనపు ఎస్పి శ్రీమతి వెంకటరత్నం పలువురు షార్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు










Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget