01-10-2021
మండల ప్రజా పరిషత్, కావలి నందు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి ఆలూరు కొండమ్మ గారి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించబడినది. ఈ కార్యక్రమము లో ఆమె గ్రామ పంచాయతీ నందు జరుగు అభివృద్ధి కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలకు చేరవేయాలని ఆమె కోరారు. మరియు జడ్ పి టి సి సభ్యులు శ్రీ జంపాని రాఘవులు గారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో చేర వేయుటకు అధ్యక్షుల వారి సహకారం అవసరమని మరియు జిల్లా పరిషత్ నుండి నిధులు తీసుకురావడానికి నా వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియ చేసినారు. పై కార్యక్రమంలో ఎంపీడీవో, వెంకట సుబ్బారావు, విస్తరణాధికారి, ఆదినారాయణ రావు, మండల పరిషత్ పరిపాలనాధికారి శ్రీధర్ బాబు, ఏ పీ ఓ(NREGES), పంచాయితీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
Post a Comment