ఉదయగిరి లో జరిగిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బాలినేని రామారావు,తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి.
గత ప్రభుత్వం వల్ల వచ్చిన ఆదాయం మాత్రం కావాలా!గత ప్రభుత్వ బకాయిలు మాత్రం చెల్లించరా!ఉపాధిహామీ మిగిలిన బిల్లులు, నీరు,చెట్టు బిల్లులు తో పాటు గృహనిర్మాణ బకాయిలు చెల్లించే వరకూ తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటం చేస్తుంది.
ఉదయగిరి లో జరిగిన ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలోతెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఉదయగిరి మాజీ శాసనసభ్యుడు బాలినేని రామారావు గార్లతో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం వల్ల వచ్చిన ఆదాయం మాత్రం తీసుకుంటూ, గత ప్రభుత్వంలో పనులు చేసిన వారికి చెల్లించవలసిన బకాయిలు మాత్రం చెల్లించడము లేదు.
కేంద్ర ప్రభుత్వ నిధులైన ఉపాధిహామీ నిధులతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, వాటిని పనులు చేసిన వారికి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించింది.
తెలుగుదేశం పార్టీ చేసిన న్యాయపోరాటం ఫలితంగా హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారికి బిల్లులు చెల్లిస్తుంది.
నీరు- చెట్టు తో సహా ఇతర నిధులతో గత ప్రభుత్వం హాయములో పనులు చేసి బిల్లులు రానివారికి చివరి పైసా వచ్చే వరకు న్యాయపోరాటం చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి, దనికొరకు అవసరమైన సమాచారం సేకరించడము కోసం మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలోను,నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయములోను ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు.
కావున గత ప్రభుత్వం లో పనులు చేసి బిల్లులు రాని వారు,గత ప్రభుత్వ హయాంలో ఇల్లులు కట్టుకొని బిల్లులు రాని వారు తమ దగ్గర ఉన్న ఆధారాలను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయములో అందచేస్తే వారికి బిల్లులు వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అన్నారు.
ఈ సమావేశంలో నుడా మాజీ డైరెక్టర్ ఖాజావలి,తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి రాపూరు సుందరరామిరెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి సురేంద్రబాబు మరియు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post a Comment