అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కవిత రెడ్డి దంపతులు మూలానక్షత్రం రోజు ప్రముఖులు రాక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన నల్లపరెడ్డి కుటుంబ సభ్యులు 15 వ తేదీ ఆలయంలో అన్నదానం,ప్రత్యేక పూజలు కోటమ్మ తల్లి ఆలయ ట్రస్ట్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రభ✍️మీజూరు మల్లి✍️:దసరాశరన్నవరాత్రి మహోత్సవాలకు కోట లోని కోటమ్మ తల్లిఆలయం,వైష్ణవి దుర్గాదేవి ఆలయాలు ముస్తాబైయ్యాయి గురువారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగవైభవంగానిర్వహించేందుకుఏర్పాట్లుచేశారు.మూలానక్షత్రమైన ఈ నెల 12న కనకదుర్గ అమ్మవారికి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,నల్లపరెడ్డిరాజేంద్రకుమార్ రెడ్డి,నల్లపరెడ్డి జగదీష్ కుమార్ రెడ్డి, కొడవలూరు సుబ్బారెడ్డి,శైలాజ రెడ్డి దంపతులు, నల్లపరెడ్డి కుటుంబ సభ్యులు ప్రముఖులుఅమ్మవార్లకుపట్టువ్రస్తాలు సమర్పిస్తారని ఆలయ ట్రస్ట్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగాజగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దసరా ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించడం ఆనవాయితీ అని ఆయన తెలిపారు. ఆ తర్వాత ప్రముఖులు,భక్తులు సమర్పించేవారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సమేతంగా వైష్ణవి దుర్గాదేవి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాము అని తెలిపారు.
గురువారం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం
నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజు గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు వేద పండితులు, అర్చకులు సుప్రభాతసేవతో అమ్మవారిని మేల్కొలిపి, శాస్త్రోక్తంగా స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనలు చేస్తారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతులు ఇచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.
నేటి అలంకారం శ్రీస్వర్ణ కవచాలంకృత
దుర్గాదేవిదేవీశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలిరోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం కోటలోని కోటమ్మతల్లి,వైష్ణవి దుర్గాదేవిఅమ్మవార్లనుశ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు.అమ్మవారినిస్వర్ణకవచాలంకృతదుర్గాదేవిగాదర్శించుకోవడంతో సకలదారిద్యాలుతొలిగిపోయిసుఖసంతోషాలతో ఉంటామని భక్తులనమ్మకం అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు,ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య, కోట ఉప సర్పంచ్ గాది భాస్కర్, వాక విజయ్ భాస్కర్ రెడ్డి,మీజూరు మల్లి కార్జున రావు, షేక్ అబ్దుల్లా, ప్రకాశం,కుమార్, భక్తులు ప్రముఖులు పాల్గొన్నారు.
Post a Comment