విజయదశమి పండుగ కులాలకు మతాలకు సంబంధించిన పండుగ కాదు,విజయదశమి పండుగ మానవత్వానికి సంబంధించిన పండుగ. ధర్మాన్ని స్థాపించడం కోసం అధర్మాన్ని వధించిన రోజును, దుర్గామాత మహిషాసురుని వధించిన రోజును విజయదశమి పండుగగా జరుపుకుంటాం. మన పక్కింటి వాళ్లకు,స్నేహితులకు,రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరిగినా పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాము. ఎక్కడ అన్యాయం జరిగినా,ఎక్కడ అధర్మం జరిగినా,ఎక్కడ మోసం జరిగినా, విజయదశమి పండుగ స్ఫూర్తి తో వాటి పై పోరాడాలి.... అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి. విజయదశమి పండుగను పురస్కరించుకుని,గురువారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు నగరంలోనీ హరనాథపురం ఆయన నివాసంలో మీడియా ద్వారా నగర ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగతో మీ జీవితాల్లో ఉన్న సమస్యలు అన్ని తొలగిపోయి, అందరి జీవితాలు సుఖశాంతులతో నిండాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను అన్నారు. ధర్మాన్ని స్థాపించడం కోసం అధర్మాన్ని వధించిన రోజు, దుర్గామాత మహిషాసురుని వధించిన రోజున విజయదశమి గా జరుపుకుంటాం అన్నారు. ఈ పండుగను ప్రాంతాల వారీగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారని, ఒక్కో విధంగా జరుపుకుంటారని అన్నారు. నార్త్ సైడ్ రాష్ట్రాల్లో రామ్ లీలా గా జరుపుకుంటారని అంటే రావణాసురుడిని రాముడు వధించిన రోజని. దాని ముఖ్య ఉద్దేశం కూడా ధర్మాన్ని స్థాపించడం కోసం అధర్మాన్ని వదించడమేనని అన్నారు. వెస్ట్ సైడ్ రాష్ట్రాల్లో చూస్తే,అధర్మం వైపు ఉన్న కురువంశాన్ని ( లక్ష మందిని ) అర్జునుడు ఓడించడం, దహించడాన్ని పండుగగా చేసుకుంటారని, అక్కడ కూడా అధర్మం పై ధర్మం గెలవడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రస్తుత రోజుల్లో మన పక్కింటి వాళ్ళకి, రోడ్ల పైన, మన రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరుగుతుంటే, ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చుంటున్నామని, మనకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పండుగలన్నీ మనకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అధర్మం జరిగినా, ఎక్కడ మోసం జరిగినా, దాని పైన పోరాడటమే నేర్పుతున్నాయని, అన్యాయాన్ని ఎదిరించడం ప్రతీ పౌరుడి, ప్రతి మనిషి యొక్క బాధ్యతనీ అన్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పాలన బాగలేక అందరూ అన్యాయాలకు, అక్రమాలకు గురవుతున్నారని, వాటినీ ప్రశ్నించడం వాటిపై పోరాడడం ప్రతీ ఒక్కరి బాధ్యత కావాలని కోరారు. విజయదశమి పండుగ కులాలకు మతాలకు సంబందించిన పండుగ కాదని, విజయదశమి పండుగ మానవత్వానికి సంబంధించిన పండుగని అన్నారు. పండుగ అంటే కేవలం పిండి వంటలు చేసుకుని తిని, కొత్త బట్టలు వేసుకుని తిరగడం మాత్రమే కాదనీ, ప్రతి పండుగ మనకు ఒక మంచి మార్గాన్ని, మంచి నడవడికను చూపుతాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు, పౌరులు, అందరూ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా విజయదశమి పండుగ స్ఫూర్తితో ఎటువంటి బేధాలు లేకుండా మన వంతు బాధ్యతగా వాటి పై పోరాడాలని పిలుపునిచ్చారు.....
Post a Comment