తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండల కేంద్రంలో సచివాలయం ప్రారంభోత్సవానికి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి దంపతులను ఆహ్వానించిన గౌరవ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తున శివకుమార్ గారు.
రాష్ట విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సనుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా తెనాలి నియోజకవర్గములోని కొల్లిపర మండలంలోని కొల్లిపర-2 సచివాలయ భవనాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
గుంటూరు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గారు, అదేవిధంగా మండల ఎంపీపీ, గ్రామ సర్పంచ్, అధికారులు అనధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేయడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సేంద్రియ వ్యవసాయానికి పెద్ద పీట వేయాలని ఆలోచనతో రైతులను ఆ వైపుగా మరల్చాలని ఆలోచనతో ఉన్నారు కాబట్టి మన తెనాలి నియోజకవర్గంలో అనేక మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారని గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీసం పది శాతం మంది రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మార్చగలిగితే రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించగలమని చెప్పి ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గారిని శాలువాతో సత్కరించడం జరిగింది.
Post a Comment