విధుల నుంచి తొలగించిన అంగనవాడీ టీచర్ నుంచి 14 సంవత్సరాల వేతనం రికవరీ చేయాలి...
దొంగ సర్టిఫికేట్ లతో అంగనవాడీ టీచర్ గా విధులు నిర్వహించి అధికారుల ఎంక్వేరీలో పట్టుబడి విధుల నుంచి తొలిగించబడ్డ అంగనవాడీ టీచర్ ఇరువురు పద్మావతి నుంచి14 సంవత్సరాల వేతనాన్ని రికవరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సత్యవోలు పంచాయతీ ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని స్ధానిక జర్నలిస్ట్ క్లబ్ నందు సత్యవోలు పంచాయతీ గ్రామస్తులు మాట్లాడుతూ కొండాపురం మండలం సత్యవోలు పంచాయతీ లో చెల్లెలు సర్టిఫికెట్ లతో ప్రభుత్వాన్ని అధికారులను బురుడీ కొట్టించి అక్రమంగా అంగనవాడీ విధులు నిర్వహించిన ఇరువురు పద్మావతి పై చర్యలు తీసుకోవాలని గత రెండు నెలలక్రితం జిల్లా పీడీని కలసామని అనంతరం వారు విచారణకు వింజమూరు సిడిపివో ,కొండాపురం ఎమ్మార్వో ను ఆదేశించారన్నారు. వారు ఇరువురు ఎంక్వేరీలో అంగనవాడీ టీచర్ ను విధుల నుంచి తొలిగించారన్నారు. అయితే ఆమె అక్రమంగా ప్రభుత్వ అధికారులను మోసం చేసి 14 సంవత్సరాల వేతనాన్ని రికవరీ చేయలని కోరారు. అయితే జిల్లా పిడీ రోజ్ మాండ్ అక్రమ పద్దతిలో విధులు నిర్వహించిన అంగన్వాడీ ఇరువురు పద్మావతి పై చర్యలు తీసుకోవాలని విజమూరు సిడిపివో పద్మావతిని ఆదేశించిన ఆమె గత నెల రోజులుగా ఎందుకు జ్యాప్యం చేస్తున్నారో తెలియటం లేదన్నారు. ఆమె ఇలాంటి వారిని కాపడటం పద్దతికాదన్నారు.వెంటనే తొలిగించిన అంగనవాడీ టీచర్ నుంచి వేతనం రికవరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోని ఎడల సిడిపివో ను కూడా భాద్యలను చేస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్ధామని గ్రామస్థులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సత్యవోలు పంచాయతీ గ్రామస్తులు గద్దె రామకృష్ణ గద్దె వంశీకృష్ణ మందపల్లి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment