100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మానవహారం

 పినాకిని సత్యాగ్రహ ( గాంధీ ) అశ్రమం...   గాంధీ గారి స్వహస్తములతో ప్రారంబింపబడి...    100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మానవహారం







01.10.2021 వ తేదీన సాయంత్రం 05.00 గంటలకు జిల్లా కలెక్టర్ శ్రీ K.V.N. చక్రధర్ బాబు IAS, గారు పినాకిని సత్యాగ్రహ (గాంధీ) ఆశ్రమం, పల్లెపాడు నందు గాంధీ గారి స్వహస్తములతో ప్రారంబింపబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2000 అడుగుల త్రివర్ణ పతాకం  తో మానవహారం కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ పి. చంద్ర శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వయంగా మహాత్ముని స్వహస్తాలతో 1921 వ సంవత్సరములో ప్రాంభించబడిన దక్షిణ సబర్మతి ఆశ్రమంగా పిలవబడే విశిష్టమైన మన పినాకిని సత్యాగ్రహ ( గాంధీ ) అశ్రమం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గాంధీ జయంతికి ముందు రోజు అయిన నేడు నెల్లూరు అంబేద్కర్ బొమ్మ (VRC Center) నుండి గాంధీ బొమ్మ వరకు  విద్యార్ధిని విద్యార్ధులతో 2000 అడుగుల మూడు రంగుల జండాతో మానవహారం ఏర్పాటు చేశామని తెలియచేసారు. 

జిల్లా కలెక్టర్ శ్రీ K.V.N. చక్రధర్ బాబు IAS, గారు మరియు నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ పి. చంద్ర శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ దక్షిణ సబర్మతి ఆశ్రమంగా పిలవబడే విశిష్టమైన మన  పినాకిని సత్యాగ్రహ (గాంధీ) ఆశ్రమానికి జాతీయ స్థాయి గుర్తింపునకు అందరం కలిసి ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు. 

మొదటగా VRC కూడలి నందు గల డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి విగ్రహమునకు జిల్లా కలెక్టర్ శ్రీ K.V.N. చక్రధర్ బాబు IAS, గారు పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

తదుపరి VRC కూడలి నుంచి జిల్లా కలెక్టర్ శ్రీ K.V.N. చక్రధర్ బాబు IAS, గారు, నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ పి. చంద్ర శేఖర్ రెడ్డి గారు,  రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మరియు గాంధేయ వాధులు, రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు పాదయాత్రగా గాంధీ బొమ్మ వరకు చేరుకొని గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..

ఈ కార్యక్రమ్మమునకు వివిధ కళాశాలకు, పాఠశాలలకు చెందిన విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు. పాల్గొన్న విద్యార్ధిని విద్యార్ధులు గాంధీ గారి వేషధారణ తో మరియు కోలాటం తో అందరినీ ఆకట్టుకొన్నారు. 

ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా శాఖ వైస్ ఛైర్మన్ శ్రీ డి. సుధీర్ నాయుడు, రాష్ట్ర శాఖ మేనజింగ్ కమిటీ సభ్యులు శ్రీ డి. రవి ప్రకాష్, జిల్లా శాఖ మేనజింగ్ కమిటీ సభ్యులు శ్రీ గునపాటి ప్రసాద్ రెడ్డి,        శ్రీ యాలమూరి రంగయ్య నాయుడు, శ్రీ యడవలి సురేష్, శ్రీ బయ్యా ప్రసాద్, శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్,   శ్రీ గంధం ప్రసాన్నాంజనేయులు నెల్లూరు జిల్లా శాఖ కింద వున్న వివిధ ప్రాజెక్టుల కన్వీనర్లు, కొ- కన్వీనర్లు, గాంధేయ వాధులు, రెడ్ క్రాస్ జీవిత కాల సభ్యులు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ పి. చంద్ర శేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమునకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతము చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget