ఆత్మకూరు పట్టణంలో కొండమ్మ అనే మహిళ మృతి అత్యంత హేయమైన సంఘటన అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కొండమ్మ అనే ఓ మహిళ ఆత్మహత్య సంఘటనపై స్పందించి ఆత్మకూరు పట్టణానికి గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు విచ్చేశారు.. ఈ సందర్భంగా వారు పట్టణంలోని జె ఆర్ పేట లో నివాసం ఉంటున్న కొండమ్మ ఇంటికి వెళ్లి ఇంటి పరిసరాలను పరిశీలించి కొండమ్మ పిల్లలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడారు.సాక్షాత్తు భర్త భార్యను ఆత్మహత్య కు ప్రోత్సహిస్తూ వీడియో తీయడం బాధాకరమని, మీ కుటుంబానికి మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పిల్లలకు శ్రీమతి పద్మగారు భరోసా కల్పించారు..ఇటువంటి సంఘటన నిజంగా మానవత్వం ఉన్న మనుషులకు సిగ్గుచేటైన సంఘటనని అన్నారు. తర్వాత ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కట్టుకున్న భార్య ప్రాణం తీసుకుంటూ ఉంటే ఆమె భర్త కనీసం మనిషిగా కూడా స్పందించక పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి సంఘటన ఒక స్త్రీ లోకానికి కాకుండా మానవ లోకానికి తీరని మచ్చ అని శ్రీమతి పద్మ గారు తెలిపారు..ఇటువంటి మృగాళ్లు కూడా మనుషుల మధ్య ఉన్నారా అనిపించే ఈ సంఘటన ఇది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడతామని అన్నారు..ఏ చిన్న సంఘటనను కూడా రాష్ట్ర పోలీస్ స్పందించే విధంగా దిశా యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ప్రచారం చేస్తూ ఉన్న కూడా దానిని ఉపయోగించుకునే అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని రాష్ట్ర సచివాలయ పోలీస్ వ్యవస్థ ద్వారా మరింతగా దిశ యాప్ గురించి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు.. గుండమ్మ పిల్లలకు జిల్లా కలెక్టర్ ద్వారా సంప్రదించి తగు న్యాయం చేస్తామని కొండమ్మ మృతికి ప్రత్యక్షంగా కారుడైన ఆమె భర్త ను కఠినంగా శిక్షించేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామని అన్నారు.అలాగే వైజాగ్ లో జరిగిన సంఘటనపై వారు మాట్లాడుతూ నిందితులు ఏ పార్టీ వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు... వీరి వెంట మహిళా కమీషన్ మెంబర్ గజ్జల లక్ష్మీ.. ఐసీడీఎస్ పీడీ రోజ్ మాండ్, ఆత్మ కూరు ఆర్డీవో చైత్రవర్షిణి, మున్సిపల్ కమీషనర్ రమేష్ బాబు, . ఛైర్ పర్సన్ వెంకట రమణమ్మ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు----
Post a Comment