చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నష్టపరిహారంఅందించడంలో అధికారుల విఫలం
డికేటి, సి జె ఎఫ్ ఎస్, అసైన్మెంట్ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండానే ఏపీఐఐసి పేరు మిందా నమోదు
రైతులకు మంచి నష్టపరిహారాన్ని త్వరగా అందరికీ ఓకే విడతలో అందించాలి
సజ్జలను కోరిన పేర్నాటి
:చెన్నై- బెంగుళూరు కోస్టల్ కారిడార్ లో భూములను కోల్పోయిన భూ బాధితులు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోరారు.
గురువారం అమరావతి తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారులుసజ్జల రామకృష్ణా రెడ్డిని క పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పేర్నాటి అనుచరులు, రైతులు మర్యాద పూర్వకంగా కలిసి తీర ప్రాంతంలోని సిబిఐసి (చెన్నై బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్)భూసేకరణలో రైతులకు సంబందించిన పలు సమస్యలుఆయన దృష్టికి తీసుకువెళ్లి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పేర్నాటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపక్షిపాతిప్రభుత్వంఅని,చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో జరుగుచున్న భూసేకరణ నష్టపరిహారం అధికారులు ఆ దించడంలో విఫలం అవుతున్నారుతెలిపారు.డికేటి, సి జె ఎఫ్ ఎస్, అసైన్మెంట్ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండానే ఏపీఐఐసి వారి పేరుమీదుగా భూములను రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు, ఈతప్పిదం అధికారులుదికాదా అనిఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నో సంవత్సరాలుగా సాగుచేయుచున్న రైతులపేర్లనుసాగుదారులగా గుర్తించకపోవటం రెవెన్యూ అధికారుల లోపంకాదా అని ప్రశ్నించారు,అదేమని రైతులు అడిగితే మీ పేర్లు రెవెన్యూ రికార్డులలో లేవు అని,మా ముందు రెవెన్యూ అధికారులు మీ పేర్లు నమోదు చేయలేదు అది మా తప్పా... అంటూ ఇప్పుడున్న రెవెన్యూ అధికారులు చెప్పడం ఏమిటి అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆక్రమణ సాగు రైతులకు ఎంతో నష్టపరిహారం ఇస్తారా ఇంత వరకు అధికారులు ప్రకటించలేదుఅని,కొత్తపట్నం గ్రామపంచాయతీ లోని రైతుల భూములు ఆక్వా కల్చర్సాగు,వరి,వేరుశనగ,సవక,ముంతమామిడి సాగు చేసే సారవంతమైన భూములు కలిగి ఉన్నారు తెలిపారు, అందువలన గత ప్రభుత్వాలు భూసేకరణ చేయాలి అంటే సరియైన నష్టపరిహారం ఇవ్వని కారణంగారైతులుఒప్పుకోలేదు అన్నారు, అందుకే ఆనాడు భూసేకరణ జరగలేదు అని ఆయన చెప్పారు.
జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి ని భూ బాధిత రైతులు కలిసి వారి సమస్యలు చెప్పుకోవడం జరిగింది అన్నారు,సజ్జల సలహ మేరకు పట్టాకు 21,75,000,డికేటి, సి జె ఎఫ్ ఎస్, అసైన్మెంట్, భూములకు 15,00,000 రుపాయలుగా అధికారులు నిర్ణయించారు అని వెల్లడించారు,కాని ఒకేసారి భూసేకరణ చేస్తామని చెప్పారు,కాని ఇప్పుడు దశలవారిగా భూసేకరణ అంటున్నారు అనీ ఈ లోపం ఏపీఐఐసి అధికారులదా లేదా రెవెన్యూ అధికారులకు అర్ధం కాక రైతులు తికమక పడుతున్నారు ఆయన చెప్పారు.
వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్యలకు పరిష్కారం చూపి కొత్తపట్నం గ్రామపంచాయతీ లోని భూసేకరణ చేయాలి అని కోరారు,రైతులకు న్యాయం చేయాలని,లేని పక్షంలో భూసేకరణ సజావుగా సాగేందుకు రైతులు సహకరించరు అనీ హెచ్చరించారు, రైతుల పక్షాన సజ్జల రామకృష్ణ రెడ్డి అధికారులతో చర్చించి రైతులకుమంచినష్టపరిహారాన్ని త్వరగా అందరికీ ఓకే విడతలో ఇప్పించవలసిందిగా సజ్జలను కోరడం జరిగింది అని ఆయన తెలిపారు,ఈ కార్యక్రమంలో సిద్దవరం సొసైటీ అధ్యక్షుడు పాదర్తి రాధా కృష్ణా రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్, ఉప్పల రఘు, దువ్వూరు సాయి కృష్ణా రెడ్డి, వైసీపీ నేతలు ఉప్పల ప్రభాకర్ రెడ్డి, ఇన్నమాల వెంకటాద్రి, వెంకురెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.
Post a Comment