నెల్లూరు, సెప్టెంబర్ 28: గ్రామ సచివాలయం పరిధిలో అర్జీలు ఎక్కువగా పెండింగ్లో ఉంటున్నాయని, త్వరితగతిన అర్జీలను పరిష్కరించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం బోగోలు మండలంలోని అల్లి మడుగు పంచాయతీలోని కడనూతల, కోవూరుపల్లి గ్రామ సచివాలయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఎక్కువగా సచివాలయాల పరిధిలోని అర్జీలు వస్తున్నాయని, గడువు దాటాక కూడా ఈ అర్జీలను పరిష్కరించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు సచివాలయం పరిధిలో అర్జీలను పరిష్కరించాలన్నారు. ప్రతి శుక్ర శనివారాలు గ్రామ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి వారి సమస్యలను తెలుసుకోవాలని సిబ్బందికి సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ తప్పకుండా వేయాలన్నారు. సచివాలయాలకు సంబంధించిన సమాచారాన్ని మండల అభివృద్ధి అధికారి నాసరరెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డిఓ శ్రీ శీనా నాయక్, తాసిల్దార్ శ్రీ వెంకట్రామ్ రెడ్డి, కడనూతల సచివాలయ సిబ్బంది రామకృష్ణ, వెంకటేశ్వరరావు, హిమజ, నాగ సతీష్ కుమార్, కోవూరు పల్లి సచివాలయ సిబ్బంది లక్ష్మీ ప్రసన్న, జయశ్రీ, అనిత, రాజేష్, మనోజ్, భాను తదితర అధికారులు పాల్గొన్నా
రు.
Post a Comment