జాతీయ పునర్నిర్మాణమే ఊపిరిగా పనిచేస్తున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం: ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్
చిల్లకూరు ఏబీవీపీ నూతన కమిటీని ప్రకటించిన ఏబీవీపీ నాయకులు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక చిల్లకూరు వెంకటేశ్వర కళాశాలలో ఏబీవీపీ చిల్లకూరు నూతన నగర కమిటీ ని ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మరియు జిల్లా కన్వీనర్ కార్తీక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ పునర్నిర్మాణమే ఊపిరిగా దేశభక్తి విలువలతో విద్యార్థి సమస్యలు పరిష్కరిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ముందుకెళ్తుందని, విద్యార్థులు దేశం కోసం పని చేయడానికి ముందుకు రావాలని, విద్యార్థి సమస్యలు పరిష్కార మార్గానికి ఏబీవీపీ దారి చూపుతుందని అందుకే ఏబీవీపీ ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం గా ఏర్పడిందని ఆయన తెలిపారు, మరియు జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ స్కాలర్ షిప్ లు మరియు జీవో నెంబర్ 77, 42 లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారానికి ఏబీవీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది విద్యార్థులంతా ఏకమై సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా నూతన కమిటీని ప్రకటించారు, నూతన కమిటీలో నగర కార్యదర్శి గా వంశీ నగర సహాయ కార్యదర్శి గా భార్గవ్ మరియు సతీష్ ఉపాధ్యక్షుడుగా మురారి, సభ్యులుగా శీను, మునిచంద్ర ,ప్రణయ్, రాంబాబు, ప్రదీప్ ,కిరణ్ ,సతీష్ ,రాజేష్ ,చైతన్య నూతన కమిటీ లో బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చిన్న, ఏబీవీపీ నాయకులు ముఖేష్, ప్రదీప్ ,సురేష్ మరియు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు
Post a Comment