శ్రీసిటీలో బ్లూస్టార్ ఏసీల పరిశ్రమకు భూమి పూజ

రూ .540 కోట్ల పెట్టుబడి : 1500 మందికి పైగా ఉపాధి

రవి కిరణాలు న్యూస్ తడ  (శ్రీ సిటీ) :







         శ్రీసిటీలో బ్లూస్టార్ ఏసీ మెషిన్స్, విడిభాగాల తయారీ నూతన పరిశ్రమ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) లో భాగంగా పరిశ్రమ ఏర్పాటుకు బ్లూస్టార్ ముందుకురాగా, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ లాంఛనంగా భూమిపూజ చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లూస్టార్ ప్రెసిడెంట్, సీఈఓ సి.పి.ముకుందన్ మీనన్, వైస్ ప్రెసిడెంట్ వి.కసబేకర్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్  రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


సమావేశాన్ని ఉద్దేశించి త్యాగరాజన్ మాట్లాడుతూ, ప్రపంచస్థాయిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ తయారీ కార్యకలాపాలను గణనీయంగా పెంచడానికి చేపట్టిన వ్యూహాత్మక చొరవలో భాగంగా అధునాతన వసతులతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రేరణతో PLI స్కీమ్‌ ప్రభావంతో నూతన ప్లాంట్ లో ముఖ్యంగా విడి భాగాలను తయారు చేపట్టనున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌పై దృఢమైన నమ్మకం ఉన్న తాము, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేటర్ పరిశ్రమలో అతిపెద్ద దేశీయ తయారీదారుగా ఎదగడానికి ఆచరణాత్మక పయనం  సాగిస్తున్నామన్నారు. 


తన మొదటి శ్రీసిటీ సందర్శనను గుర్తుచేసుకున్న త్యాగరాజన్, ప్రపంచశ్రేణి మౌళిక సదుపాయాలకు ఏ మాత్రం తీసిపోని ఇక్కడ వాతావరణాన్ని చూసి, వెంటనే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 


ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, ఎయిర్ కండిషనింగ్ మరియు రిఫ్రిజిరేటర్ తయారీలో పేరుగాంచిన ప్రముఖ స్వదేశీ బ్లూస్టార్ సంస్థను శ్రీసిటీకి ఆహ్వానించడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. బ్లూస్టార్ కు సంబంధించి దేశంలో ఇది 6వ  ఉత్పాదక యూనిట్‌, మరియూ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిది. దీనితో కన్స్యూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమకు కూడా శ్రీసిటీ ఆకర్షణీయమైన ప్రదేశంగా గుర్తింపు దక్కించుకుందన్నారు. బ్లూస్టార్ తో పాటు డైకిన్,  మరో  రెండు ప్రముఖ   ఏసీ మెషిన్స్ తయారీ సంస్థలు శ్రీ సిటీకి ప్రాధాన్యతనివ్వడంతో, వైట్ గూడ్స్ రంగానికి ఒక క్రొత్త   అనుకూల  వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, ఇది స్థానిక యువతకు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు. స్ఫూర్తిదాయకమైన నాయకత్వం, వ్యాపార అనుకూల వాతావరణం, చక్కని పారిశ్రామిక విధానంతో ఏపీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో  అగ్రస్థానంలో ఉందన్నారు. 


శ్రీసిటీ దేశీయ టారిఫ్ జోన్ (DTZ) లో 20 ఎకరాల స్థలంలో నిర్మించబడే ప్లాంట్, అక్టోబర్ 2022 నాటికి ఊత్పత్తులు ప్రారంభిస్తుంది. ఈ ప్లాంట్ దశల వారీగా దాదాపు రూ .540 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయబడుతుంది , ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ఉత్పత్తి సామర్ధ్యం 1.2 మిలియన్లకు దగ్గరగా ఉంటుంది, దీని ద్వారా 1500 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. ఈ ప్లాంట్ దక్షిణ భారత దేశ మార్కెట్ల  అవసరాలను తీర్చగలదు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget