నెల్లూరు జిల్లా జడ్పీ సీఈఓ బదిలీ
నాడు.. కమిషనర్ మూర్తి, నిన్న జాయింట్ కలెక్టర్లు వినోద్ కుమార్, ప్రభాకర్ రెడ్డి
నేడు జెడ్పీ సీఈవో సుశీల రాజకీయ బదిలీ గా విమర్శలు..
నెల్లూరు జిల్లా పనిచేసే అధికారులకు అచ్చి రావడం లేదు..నాడు కమిషనర్ పివీవీఎస్ మూర్తి దగ్గర్నుంచి జాయింట్ కలెక్టర్లు వినోద్ కుమార్, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి నేడు తాజాగా జడ్పీ సీఈఓ సుశీలను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక ఏడాది 11 నెలల కాలంలో (సుమారుగా 2 ఏళ్ళు) జడ్పీ సీఈఓ గా జిల్లా పరిషత్ ను తరపున ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో పాటు జిల్లా ఉన్నతాధికారులు ఏ బాధ్యతలు అప్పగించిన వాటిని విజయవంతంగా పూర్తి చేశారు. ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల ను జిల్లా కలెక్టర్ చక్రధర బాబు మార్గదర్శకంలో పకడ్బందీగా నిర్వహించారు.. కోవిడ్ మహమ్మారి సమయంలో నోడల్ అధికారిగా ఎంతోమంది పేద ప్రజలు, జర్నలిస్టులకు తన వంతు గా సేవలందించారు
నెల్లూరు జిల్లాలో పనిచేసే అధికారులను ఎక్కువకాలం అధికార పార్టీ నేతలు ఉండనీయరు. చాలా ఉదాహరణలు చూశాం.. నెల్లూరు నగర కమిషనర్ మూర్తి దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ ల వరకు మనం చూస్తూనే ఉన్నాం. జిల్లా పరిషత్ సీఈవో గా వివాదరహితురాలిగా గుర్తింపు పొంది తనదైన శైలిలో జడ్పీ లో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన జడ్పీ సీఈఓ ను ఆకస్మికంగా బదిలీ చేయడం అధికార పార్టీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండున్నరేళ్లుగా నెల్లూరు జిల్లాలో పనిచేసే అధికారుల బదిలీలు ఆకస్మికంగానే జరిగిపోతున్నాయి. జిల్లా బాధ్యతలు చూస్తున్న మంత్రులకు ముఖ్యమైన జాయింట్ కలెక్టర్ లు, కమిషనర్, జడ్పీ సీఈఓ ల బదిలీలు తెలియవనుకుంటే పొరపాటే.. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే జిల్లాలో అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి.
Post a Comment