పెళ్లకూరు మండలం శిరసనంబేడు గ్రామంలో
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిరుపేదల జీవనాధారమైన గేదెలు మృతి. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం లోని శిరసనంబేడు గ్రామంలో అంగన్వాడి బడి కి 20 మీటర్ల దూరంలో విద్యుత్ అధికారులు ఒక మినీ ట్రాన్స్ ఫారం ఏర్పాటు చేశారు. ఏ ట్రాన్స్ఫారం కు రక్షణ వలయం ఏర్పాటు చేయనందువలన కట్టా సిద్దయ్య అనే నిరుపేద రైతు జీవనాధారమైన గేదెలు విద్యుత్ మినీ ట్రాన్స్ ఫారం కు వేలాడుతున్న విద్యుత్ తీగలకు తగిలి గతంలో మూడు గేదెలు, ఈరోజు మూడు గేదెలు మరణించాయి. ఈ విషయంపై పెళ్లకూరు ఏఈ గారికి, లైన్ మాన్ లకు, హెల్పర్ లకు తెలియజేయగా వారు పట్టించుకోలేదు. ఈరోజు గేదులు చనిపోయాయి రేపు అంగన్వాడి బడిలో చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి అని గ్రామస్తులు లు భయాందోళనకు గురవుతున్నారు ఇకనైనా నా మినీ ట్రాన్స్ఫారం రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తులను పశుపక్ష్యాదులను కాపాడవలసిందిగా అధికారులను కోరడమైనది.
Post a Comment