రైతులపై కేసులు పెట్టింది వైకాపా ప్రభుత్వం కాదా....? రైతులు క్రాప్ హాలిడే ప్రకటించింది వైకాపా ప్రభుత్వంలో కాదా....? పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్

 రైతులపై కేసులు పెట్టింది వైకాపా ప్రభుత్వం కాదా....? రైతులు క్రాప్ హాలిడే ప్రకటించింది వైకాపా ప్రభుత్వంలో కాదా....?


గతంలో జిల్లాలో ఎప్పుడూ క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు లేవు....కేవలం ప్రభుత్వం పుణ్యాన  జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు..


నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రైతుబిడ్డలే.... వీరే పంటలు వేయకుండా వారి ప్రభుత్వాన్ని పొగడడం సిగ్గు లేని చర్య....


ఎదుటి వారి పై విమర్శలు చేసేటప్పుడు, అసలు రైతుల కోసం వైకాపా నాయకులు గుర్తు చేసుకోవాలి..


రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతు భరోసా కేంద్రాలు పెట్టడం హాస్యాస్పదం..


జిల్లా లో వైకాపా నాయకులు చెప్పినట్టు తెదేపా రైతులను 100% మోసం చేస్తే, వైకాపా 1000% మోసం చేస్తుంది.


రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన సంగతి మర్చిపోయి, వైకాపా నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు..


జిల్లా లో 5 లక్షల ఎకరాలు సాగు చేయడానికి నీరు ఉండి కూడా, కేవలం 1.5 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట పండించారు...


- ఒట్టూరు సంపత్ యాదవ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి


గురువారం నెల్లూరు నగరం లోని ఎన్టీఆర్ భవన్ లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు..


ఈ సందర్భంగా ఒట్టూరు సంపత్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ...




ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా దాని పై రాళ్లు వేయడమే పనిగా వైకాపా ప్రభుత్వం పెట్టుకుందనీ అన్నారు..


రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రైతు కోసం తెలుగు దేశం అన్న కార్యక్రమం చేపడితే దానిపై వైకాపా నాయకులు విమర్శలు చేయటం దారుణమన్నారు..


ఈ కార్యక్రమానికి వచ్చింది రైతులు కాదు, 200 రూపాయలు ఇచ్చి తీసుకువచ్చిన జనాలనీ వైకాపా నేతలు అంటున్నారు..అసలు రైతులను అలా మాట్లాడటానికి సిగ్గు శరం, మానవత్వం లాంటివి ఏమన్నా ఈ వైసీపీ నాయకులకు ఉన్నాయా అని అన్నారు..


ఈ జిల్లాలో 5 లక్షల ఎకరాల పంట పండించడానికి సాగునీరు ఉన్నా కేవలం 1.5 లక్షల ఎకరాలలో  మాత్రమే పంట పండించే పరిస్థితి జిల్లాలో ఉందనీ అన్నారు...


నీరు పుష్కలంగా ఉండి కూడా రైతులు పంటలు పండించలేని పరిస్థితిలో ఉండటాన్ని చూసి వైసిపి నాయకులు సిగ్గుపడాలి అని అన్నారు...


నెల్లూరు జిల్లాలో నీరు పుష్కలంగా ఉండి కూడా,వైకాపా రాజ్యసభ ఎంపీ గారి సొంత మండలం అల్లూరు లో ఉన్న 22వేల ఎకరాల్లో పంట పండించే పరిస్థితి లేకపోవడం సిగ్గుచేటనీ అన్నారు...


రైతులు స్వయంగా నిరసన తెలియపరుస్తూ క్రాఫ్ హాలిడే ప్రకటిస్తుంటే అది మరచిపోయి వైసిపి నాయకులు మాట్లాడుతున్నారన్నారు...


రైతులు పంటలు పండించకపోయినా మోకాల లోతు నీరు ఉన్నాయని వైకాపా నాయకులు సంకలు గుద్దుకుంటున్నారు. పంటలు పండించడానికి ఉపయోగపడనీ నీరు దేనికని మండిపడ్డారు..


కరోనా తీవ్రరూపం దాలుస్తున్న లెక్కచేయకుండా రైతులు పంటలు పండిస్తే వారికి గిట్టుబాటు ధర కల్పించడం లో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గుర్తుచేశారు...


రైతులకు గిట్టుబాటు ధర లేక వారు పండించిన పంటలను రోడ్డుపాలు చేసి నిరసన తెలియపరిస్తే, వాటిపై కూడా కేసులు పెట్టిన ఘనత వైకాపా ప్రభుత్వానిది అన్నారు...


ఈ జిల్లాలో ఉన్న ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ రైతులను 100% మోసం చేసింది అంటున్నారని తెలుగుదేశం పార్టీ 100% మోసం చేస్తే ఈ వైకాపా ప్రభుత్వం 1000% మోసం చేస్తోందని మండిపడ్డారు...


గతంలో జిల్లాలో ఎప్పుడూ క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు లేవని, కేవలం వైకాపా ప్రభుత్వం పుణ్యాన జిల్లాలో మొదటిసారిగా క్రాప్ హాలిడే ప్రకటించారనీ అన్నారు.


రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టడం హాస్యాస్పదం అని అన్నారు..


ప్రతి నెల రైతు భరోసా కేంద్రాల్లో జరిగే సమావేశాలకు వైకాపా కు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గానీ హాజరు కావడం లేదని అసలు వీరికి రైతులకు ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన ఉంటే కదా హాజరు కావటానికి అని హేళన చేశారు..


రైతులను పట్టించుకుని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని,  రైతులు పంటలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..


ఎదుటి వారిపై విమర్శలు చేసేటప్పుడు ముందు అసలు మనం రైతులకు ఏం చేశామో గుర్తు చేసుకోవాలని వైకాపా నాయకులకు హితవు పలికారు...


నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ రైతుబిడ్డ లేనని, వారే పంటలు వేయకుండా  ప్రభుత్వాని పొగడడానికి సిగ్గు గా లేదా అని అన్నారు...


పై కార్యక్రమం లో నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి కనపర్తి గంగాధర్, నగర ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నెల్లూరు మురళి, అనీల్, ఆనంద్, అనీం పాల్గొన్నారు....

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget