పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా మృతుల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జిల్లా యస్.పి.

 పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా మృతుల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జిల్లా యస్.పి.




పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అమరులైన 26 పోలీస్ కుటుంబాలు యొక్క కుటుబం సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం.

ప్రతి ఒక్కరితో పేరు పేరునా కుటుంబ వివరాలు.....జీవనాధారం....సమస్యలు.......తదితర వివరాలపై ఆరా నేను మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటా....ఎల్లవేళలా అందుబాటులో ఉంటా... ఎటువంటి సమస్య అయినా కలవండి. విధి నిర్వహణలో కరోనాతో ఎదుర్కోవడంలో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలు ఒంటరి వారు కాదు.. పోలీసు శాఖ తోడుగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రభుత్వేతర బెనిఫిట్స్ అన్నీ అందేలా చూడాలని ఆదేశించిన యస్.పి. గారు  కంపాన్ సేషన్ అప్పాయింట్మెంట్ కు సంబంధించిన సందేహాలకు విపులంగా వివరణ ఇచ్చిన జిల్లా యస్.పి.గారు. అడిషనల్ యస్.పి. గారి చొరవ తో మన రాష్ట్రంలోనే అత్యధికంగా కంపాన్ సేషన్ పోస్టులు ఇచ్చిన జిల్లా గా మన నెల్లూరు జిల్లా రికార్డు నమోదు చేసుకొంది. అనంతరం పోలీసు కుటుంబాలకు రుచికరమైన భోజనాలు స్వయంగా అందరికీ వడ్డించిన యస్.పి.  ఎంతో చొరవ తీసుకొని అన్ని బెనిఫిట్స్ అందించినందుకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబసభ్యులు..

                            ఈ రోజు అనగా తేది.29.09.2021 న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు "అమరులైన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమమును" ఏర్పాటు చేసి, తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా దేశ భద్రత కోస౦, ప్రజా శా౦తి భద్రతల రక్షణ కోస౦, పగలనక, రాత్రనక నెల్లూరు జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఎ౦తోమ౦ది తమ ప్రాణాలను తృణప్రాయ౦గా త్యాగ౦ చేశారు. అట్టి వారి త్యాగాలను స్మరి౦చుకు౦టూ వారి త్యాగాల పరమార్థాన్ని గుర్తి౦చి, ప్రతి ఒక్కరినీ పరామర్శించి, వారి కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య విషయాలపై విచారించి, చర్చించి వారికి పోలీస్ శాఖ ఎల్లవేళలా తోడు వుంటుందని, ఇంటిలో పెద్ద దిక్కు కోల్పోయినా అందరికి జిల్లా యస్.పి గానే కాకుండా మీ కుటుంబ సభ్యుడుగా ఉండి మీకు ఏ సమయములోనైనా ఏ సహాయము చేయడానికైనా మనస్పూర్తిగా సిద్దంగా ఉన్నానని భరోసా కల్పించారు. వారు లేని లోటుతో బాధపడుతున్న కుటుంబసభ్యులను ఓదార్చి, మీ కన్నీళ్లు తుడవడానికి జిల్లా పోలీసు యంత్రాంగం మీవెనుక ఉందని అధైర్య పడవద్దని, భరోసా కల్పించారు. అంతేకాకుండా మేము మీకు వున్నాము అనే ఒక నమ్మకాన్ని కల్పించి ,మీకు డిపార్ట్మెంట్ చేయగలిగిన సహాయ సహకారాలు త్వరితగతిన అందిస్తామని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నామని జిల్లా యస్. పి. శ్రీ విజయ రావు,IPS., గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరితో పేరు పేరునా వారికి రావాల్సిన బెనిఫిట్స్ గురించి అడిగి తెలుసుకొని, వెంటనే వచ్చేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, ఇతర ఏమైనా సందేహాలు ఉంటే అడగాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా అమరులైన 15  పోలీసు అధికారుల కుటుంబాల నుండి 28 మంది ,అదే విధంగా 5 హోం గార్డ్ కుటుంబాల నుండి 10 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అడిషనల్ యస్.పి. గారి చొరవ తో ఇప్పటివరకు జిల్లా లో 12 కంపాన్ సేషన్ అప్పాయింట్మెంట్ లు ఇప్పించడం అనేది మన రాష్ట్రంలోనే అత్యధికంగా కంపాన్ సేషన్ పోస్టులు ఇచ్చిన జిల్లాగా మన నెల్లూరు జిల్లా రికార్డు నమోదు చేసుకొంది. అనంతరం వారి పిల్లలతో మాట్లాడుతూ కంపాన్ సేషన్ గ్రౌండ్స్ లో భాగంగా మీ తల్లిదండ్రుల త్యాగ ఫలంతో ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, మీరందరూ నూతన జీవితాన్ని పొందారని, విధి నిర్వహణలో కచ్చితత్వంతో వ్యవహరించాలని, పోలీసు కుటుంబాల పిల్లలు క్రమశిక్షణతో ముందుకెళ్ళాలని, మిగిలిన పిల్లలు పోలీసు ఉద్యోగంలో చేరేలా ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం స్వయంగా రుచి కరమైన భోజనం స్వయంగా కుటుంబ సభ్యులకు జిల్లా యస్.పి. గారు వడ్డించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి వెంకటరత్నం గారు, యస్.బి. డి.యస్.పి. శ్రీ కోటా రెడ్డి గారు, SB CI-1 శ్రీ అక్కేశ్వరావు, CI-2 శ్రీ రామకృష్ణ, RI వెల్ఫేర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, RI అడ్మిన్ శ్రీ రమణారెడ్డి, పి. సూపరింటెండెంట్ శ్రీమతి కతీజాబేగం, బి.4 క్లర్క్ శ్రీ మాలకొండయ్య గారు, SBI రీజనల్ మేనజర్ శ్రీ అఫ్రోజ్ గారు, యస్.బి.ఐ. మేనజర్ శ్రీ రామ కుమార్ గారు , డి.పి.ఒ. సిబ్బంది మరియు  అమరులైన పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget