రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం వెల్లడించారు. డైరెక్టర్ల నియామకంలో నెల్లూరు జిల్లా కోట మండలంలోని పెద్ద కుటుంబానికి చెందిన రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి, మాజీ
కోట మండల పరిషత్ అధ్యక్షుడు నల్లపరెడ్డి వినోద్ రెడ్డిని రాష్ట్ర రెడ్డి వెల్ఫేర్& డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
నల్లపరెడ్డి వినోద్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ వెంట ఉంటూ పార్టీ బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేశారు, వినోద్ రెడ్డి తాత నల్లపరెడ్డి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ గురువు తండ్రి నల్లప రెడ్డి హారనాధ్ రెడ్డి కూడా గ్రామ సర్పంచ్ నుండి జిల్లా రాజకీయాల్లో శాసించారు,వీరి ఇద్దరి వారసుడు గా వినోద్ రెడ్డి రాజకీయ అరంగ్రేటం చేసి చిన్న వయసులోనే మండల పరిషత్ అధ్యక్షుడు పదవీ బాధ్యతలు చేపట్టారు, ఆ తరువాత రాష్ట్ర స్థాయి పార్టీ పదవులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన సేవలను గుర్తించిన వైసిపి అధిష్టానం వినోద్ రెడ్డి ని రాష్ట్ర రెడ్డి వెల్ఫేర్& డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారిచేయడం జరిగింది. దింతో నల్లప రెడ్డి అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు వినోద్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు,వినోద్ రెడ్డి బాబాయ్ నల్లప రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే కొనసాగుతున్నారు
Post a Comment