జల వనరులు కాదు.... ధన వనరుల శాఖ మంత్రి....మంత్రి అనిల్ పై విరుచుకుపడ్డ టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

 జల వనరులు కాదు.... ధన వనరుల శాఖ మంత్రి....


పులిచింతల ప్రాజెక్టు పై అవగాహన తెచ్చుకో


చేతకాని దద్దమ్మ మంత్రి అనిల్



మంత్రి పదవిని రక్షించుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు


మంత్రి అనిల్ పై విరుచుకుపడ్డ టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి


నెల్లూరు, ఆగస్ట్..7...


ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది దిగ్గజాలు జలవనరుల శాఖ నిర్వహించి మంచి పేరు తీసుకు వచ్చారని కానీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వంటి అవినీతి మంత్రి  లేడని జలవనరుల శాఖను ధన వనరుల శాఖగా మార్చి వేసిన ఘనత మంత్రి అనిల్ కే దక్కుతుందని టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.


పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలు తెలుసుకొని మాట్లాడాలని వ్యంగంగా వ్యాఖ్యానించారు. పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అప్పుడే జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయిందన్నారు.


డబ్బులు మిగుల్చుకోవాలన్న లక్ష్యంతో 33 గేట్లు పులిచింతలకు పెట్టాల్సి ఉంటే 24 గేట్లు మాత్రమే పెట్టారని వివరించారు.. ఒక్కసారిగా పులిచింతల్లో నీటి ప్రవాహం పెరిగిపోవడంతో గేట్లు కొట్టుకో కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాదం పెట్టిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలు అయిందని కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా ఆర్థిక పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చివరకు రైతులు కూడా క్రాప్ హాలిడే ప్రకటించారంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.. ప్రజా వేదిక కూల్చివేత దగ్గర్నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు


నెల్లూరు పెన్నా నదిలో ఇసుక, గ్రావెల్ తవ్వకాల ద్వారా మంత్రి అనిల్ వందల కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. చివరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పై కూడా కేసు పెట్టడంలో  మంత్రి అనిల్  హస్తం ఉందని ఆరోపించారు. సొంత పార్టీ వ్యక్తుల మీద కేసులు పెట్టిస్తున్న మంత్రి అనిల్ ను ఏం పిలవాలో అర్థం కావడం లేదన్నారు. తన మంత్రి పదవి పోతుందన్న సంకేతాలు రావడంతో దానిని కాపాడుకునేందుకు నోటికి ఇష్టం వచ్చినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని ధ్వజ మెత్తారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget