శీలాన్ని అమ్ముకున్న సోమిరెడ్డి.." వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య యాదవ్

 శీలాన్ని అమ్ముకున్న సోమిరెడ్డి.."


 తేదీ:11-08-2021

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య యాదవ్ గారు, వన్నెకుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ గారు, కోవెరపాళెం గ్రామ సర్పంచ్ తలమంచి సురేంద్రబాబు, కనుపూరు గ్రామ సర్పంచ్ నాటకం శ్రీనివాసులు, డీసీసీబీ డైరెక్టర్ డక్కిలి రమణయ్య, మైనారిటీ నాయకులు హుసేన్


అవినీతిపరులు, అక్రమార్కులు సోమిరెడ్డికి మడుపులు, మామూళ్లు చెల్లించి, "సోమిరెడ్డి శీలాన్ని" ఎప్పుడో దోచుకున్నారని ఎద్దేవా!



స్క్రోలింగ్ పాయింట్స్:


👉సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై నిజ నిజాలు తేల్చుకునేందుకు కంటేపల్లికి ఆహ్వానిస్తే, తోకముడిచి పారిపోయాడు.


👉సోమిరెడ్డి శీలాన్నీ అవినీతిపరులు, అక్రమార్కులు ముడుపులిచ్చి ఎప్పుడో దోచుకున్నారు.


👉శీలం కోల్పోయిన "సోమిరెడ్డికి శీల పరీక్ష" అవసరం లేదు.


👉వాస్తవాలు తెలుసుకునేందుకు కంటేపల్లికి రాలేక, ముఖం చాటేసిన సోమిరెడ్డి తన చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు తన మనుషుల చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు.


👉 సోమిరెడ్డి అటవీ భూములని చెబుతున్న భూములు, రైతులు పంటలు పండించుకోవడం వాస్తవం కాదా!


👉 రైతుల పై కక్ష గట్టి, వ్యవసాయం చేసుకుంటున్న 200 ఎకరాల పైచిలుకు భూములు రైతుల నుండి లాగేసుకొని అటవీశాఖకు  అప్పజెప్పేందుకు సోమిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.


👉 పేదరైతుల పొలాలను అటవీ శాఖకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న "రైతు ద్రోహి" సోమిరెడ్డి.


👉 అటవీశాఖ కంటేపల్లి భూములు తమవి కాదంటే, సోమిరెడ్డి మాత్రం అటవీశాఖ భూములని వాదిస్తున్నాడు.


👉 రైతులు తమ ఆధీనంలో ఉన్న భూములలో గ్రావెల్ తరలింపును అనుమతించడానికి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలి.


👉 ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటించకుండా తమ భూములు చదును చేసుకునేందుకు గ్రావెల్ తరలింపుకు అంగీకరించడం రైతుల పొరపాటు.


👉 సోమిరెడ్డి గ్రావెల్ తరలింపు విషయంలో అమాయక రైతులపై కేసు నమోదు చేయడం లేదని పదేపదే ప్రశ్నిస్తున్నాడు.


👉 కాంట్రాక్టర్లు తమరి హయాంలో ఎంట్రీ ఫీజు చెల్లించిన తరువాత, తమరు దగ్గరకు చేర్చుకున్నారు.


👉 రైల్వే కాంట్రాక్టర్ పద్మనాభ నాయుడు 2019 ఎన్నికల్లో తమరి గెలుపు కోసం, గోవర్ధన్ రెడ్డి ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం కాదా!.


👉 పద్మనాభ నాయుడు కాంట్రాక్టర్ గా పనులు చేస్తుంటే, ఆయనకు పార్టీల రంగు పులిమి, రభస చేయడం వెనుక నీకు ఇప్పటికీ ముడుపులు అందలేదన్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది.


👉 సోమిరెడ్డి ఓటమిపాలైనా, ముడుపుల కోసం అర్రులు చాస్తూ, ముడుపులు చెల్లించని వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు.


👉సోమిరెడ్డి హయాంలో గ్రావెల్ అక్రమ తరలింపులో పోలీసులు కేసులు నమోదు చేస్తే, ముద్దాయిలను పోలీసులు ముందే తన కారులో దర్జాగా కూర్చోబెట్టుకొని తిరిగాడు.


👉మా ప్రభుత్వంలో గ్రావెల్ అక్రమ తరలింపుదారులు ఎంతటివారైనా కేసులు నమోదు చేయించాం.


👉 సర్వేపల్లి రిజర్వాయర్ లో 7 లక్షల క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని, 20 లక్షల క్యూబిక్ మీటర్లు దోపిడీ చేసిన "దొంగ సోమిరెడ్డి" విమర్శలు చేయడం హాస్యాస్పదం.


👉 సోమిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, అక్రమ గ్రావెల్ తరలింపు విషయంలో గ్రామగ్రామాన పర్యటించేందుకు సిద్దం!


👉 సోమిరెడ్డి షెడ్యూల్ ప్రకటిస్తే, గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల సమక్షంలోనే అక్రమ తరలింపు సూత్రధారులెవరో, పాత్రధారులెవరో  తెలుసుకుందాం!.


👉 సోమిరెడ్డి అవినీతికి పాల్పడలేదని రుజువు అయినా, గోవర్ధన్ రెడ్డి అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ అయిన మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధం!.


👉 సోమిరెడ్డికి నీతి నిజాయితీ దమ్ము, ధైర్యం ఉంటే గ్రామాల పర్యటనకు తేదీలు విడుదల చేయాల్సిందిగా సవాల్ విసురుతున్నాం.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget