వెంకటాచలం మండలం కంటేపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత..
ఎస్సీ కాలనీ వాసుల ఆధీనంలోనే 10 గ్రావెల్ టిప్పర్లు..
ఎస్సైని నమ్మి వాహనాలను అప్పగించలేమని ఆయన ముఖం మీదే చెప్పిన కాలనీ వాసులు..
తహసీల్దార్ కు కూడా అదే రీతిలో సమాధానం
40కి పైగా టిప్పర్లు, కొన్ని ప్రొక్లెయిన్లను అక్కడి నుంచి పంపించేసిన తర్వాతే పోలీసులు వచ్చారని ఆగ్రహం..
జిల్లా ఉన్నతాధికారులు వచ్చి గ్రావెల్ తవ్విన అటవీ భూములను పరిశీలించడంతో పాటు మిగిలిన 40 టిప్పర్లు, ఐదు ప్రొక్లెయిన్లు కూడా సీజ్ చేయాలని డిమాండ్..
గ్రావెల్ మాఫియా వెనుక ఉన్న పెద్ద తలకాయను కూడా బయటకు తేవాలని షరతు..
అటవీ భూముల్లోని విలువైన సంపదను కొల్లగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
జూన్ 22న కూడా ఇదే అటవీ భూమిలో, ఇదే ప్రాంతంలో టిప్పర్లు, ప్రొక్లెయిన్లను సీజ్ చేశామని ప్రకటించి గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారని గుర్తు చేసిన కాలనీ వాసులు..
అప్పుడు వదిలేయడంతోనే ఇప్పుడు తమ ప్రాణాల మీదకు వచ్చిందని ఆవేదన..
Post a Comment